హైదరాబాద్‌కు మిశ్రమ ఫలితాలు | Mixed Results for Hyderabad in Skating Championship | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌కు మిశ్రమ ఫలితాలు

Nov 22 2018 10:08 AM | Updated on Nov 22 2018 10:08 AM

Mixed Results for Hyderabad in Skating Championship - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతర్‌ జిల్లా రోలర్‌ స్కేటింగ్‌ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌ జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఓయూలోని శాట్స్‌ సైక్లింగ్‌ వెలోడ్రోమ్‌లో బుధవారం జరిగిన జూనియర్‌ బాలుర ఇన్‌లైన్‌ హాకీ ఈవెంట్‌లో హైదరాబాద్‌ 2–0తో మెదక్‌పై, రోలర్‌ హాకీ ఈవెంట్‌లో 4–1తో కరీంనగర్‌పై, సబ్‌ జూనియర్‌ బాలుర రోలర్‌ హాకీలో హైదరాబాద్‌ 3–1తో కరీంనగర్‌పై, సీనియర్‌ మహిళల ఇన్‌లైన్‌ హాకీలో 7–0తో మెదక్‌పై విజయం సాధించాయి.

సబ్‌ జూనియర్‌ బాలికల ఇన్‌లైన్‌ హాకీలో హైదరాబాద్‌ 0–1తో మెదక్‌ చేతిలో, 1–4తో కరీంనగర్‌ చేతిలో, రోలర్‌ హాకీలో 1–6తో మెదక్‌ చేతిలో ఓటమి పాలయ్యాయి. పురుషుల ఇన్‌లైన్‌ హాకీలో మెదక్‌ 8–0తో నల్లగొండపై, మెదక్‌ 10–0తో మహబూబ్‌నగర్‌పై నెగ్గి ముందంజ వేశాయి.   


 

Advertisement
 
Advertisement
Advertisement