మిస్టర్ కూల్.. కంట తడి!! | mister cool dhoni wept for a while in dressing room | Sakshi
Sakshi News home page

మిస్టర్ కూల్.. కంట తడి!!

Jan 1 2015 3:16 PM | Updated on Sep 2 2017 7:04 PM

మిస్టర్ కూల్.. కంట తడి!!

మిస్టర్ కూల్.. కంట తడి!!

మహేంద్ర సింగ్ ధోనీ అనగానే.. అంతా మిస్టర్ కూల్ అంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఏమాత్రం తొణక్కుండా, బెణక్కుండా చాలా సరదాగా, నవ్వుతూ ఉండిపోవడం ధోనీ లక్షణం.

న్యూఢిల్లీ : మహేంద్ర సింగ్ ధోనీ అనగానే.. అంతా మిస్టర్ కూల్ అంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఏమాత్రం తొణక్కుండా, బెణక్కుండా చాలా సరదాగా, నవ్వుతూ ఉండిపోవడం ధోనీ లక్షణం. అలాంటి ధోనీ.. కంటతడి పెట్టాడంటే నమ్మగలమా? కానీ నమ్మక తప్పదు. టెస్టు కెరీర్ ముగిస్తూ తాను తీసుకున్న నిర్ణయాన్ని డ్రసింగ్ రూంలో సహచరులకు చెప్పే సమయంలో ధోనీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.

ఆఖరి టెస్ట్‌ ఆడిన అనంతరం స్నేహితులకు వీడ్కోలు చెబుతూ డ్రెస్సింగ్‌ రూమ్‌లో కన్నీటి పర్యంతమయ్యాడు. జట్టు సహచరులతో దాని గురించి మాట్లాడుతుంటే ధోనీ కళ్ల వెంట నీళ్లు ఆగలేదని.. దాంతో చుట్టూ ఉన్న మిగిలిన జట్టు సభ్యులు కూడా బాగా చలించారని ఓ జాతీయ పత్రిక తన కథనంలో పేర్కొంది. కాగా, మెల్‌బోర్న్‌ టెస్ట్‌ మ్యాచ్‌ పూర్తయిన తర్వాత విలేకరుల సమావేశంలో మాత్రం ధోనీ సరదాగా మాట్లాడాడు. లోపలకు వెళ్లిన తర్వాత అతడి లోపలి మనిషి ఇన్నాళ్లకు బయటకొచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement