గంభీర్‌ ఎందుకలా అన్నాడు? | Mirwaiz cheers for Pak again, Gambhir suggests him to 'cross the border' | Sakshi
Sakshi News home page

గంభీర్‌ ఎందుకలా అన్నాడు?

Jun 19 2017 11:54 AM | Updated on Sep 5 2017 1:59 PM

గంభీర్‌ ఎందుకలా అన్నాడు?

గంభీర్‌ ఎందుకలా అన్నాడు?

టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ తన దేశాభిమాన్ని మరోసారి బయటపెట్టాడు.

న్యూఢిల్లీ: టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ తన దేశాభిమాన్ని మరోసారి బయటపెట్టాడు. కశ్మీర్‌ వేర్పాటువాద నాయకుడు మిర్వాయిజ్‌ ఉమర్‌ ఫరూఖ్‌కు ఘాటైన సమాధానం ఇచ్చాడు. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలో పాకిస్తాన్‌ విజేతగా నిలిచినందుకు సంబరాలు చేసుకోవాలంటూ మిర్వాయిజ్‌ ఇచ్చిన పిలుపుకు దీటుగా స్పందించాడు. పాకిస్తాన్‌కు వెళ్లి వేడుకలు చేసుకోవాలని చురక అంటించాడు.

‘అంతటా టపాసులు కాల్చండి. ఈద్‌ పండుగ ముందుగానే వచ్చింది. ఉత్తమ క్రికెట్‌ జట్టు విజేతగా నిలిచింది. పాకిస్తాన్‌ టీమ్‌కు అభినందనలు’ అంటూ మిర్వాయిజ్‌ ట్వీట్‌ చేశారు. దీనికి గంభీర్‌ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ‘మిర్వాయిజ్‌ మీరు ఎందుకు సరిహద్దు దాటి వెళ్లకూడదు? చైనా బాంణాసంచా అయితే పేల్చడానికి బాగుంటుంది. రంజాన్‌ అక్కడ సెలబ్రేట్‌ చేసుకోండి. ప్యాకింగ్‌లో నేను మీకు సహాయం చేస్తాన’ని ట్వీట్‌ చేశాడు. గంభీర్‌ స్పందనపై టీమిండియా ఫ్యాన్స్‌ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టును మిర్వాయిజ్‌ అభినందించగడం ఇదే మొదటిసారి కాదు. చాంపియన్స్‌ ట్రోఫీ మొదటి సెమీ ఫైనల్లో పాకిస్తాన్‌ గెలిచినప్పుడు కూడా ఇదేవిధంగా ఆయన స్పందించారు. ఫైనల్లో భారత్‌పై పాక్‌ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement