మెస్సీకి గోల్డెన్ బాల్, రోడ్రిగ్జ్కు గోల్డెన్ బూటు | Messi wins Golden Ball, Rodriguez takes home Golden Boot | Sakshi
Sakshi News home page

మెస్సీకి గోల్డెన్ బాల్, రోడ్రిగ్జ్కు గోల్డెన్ బూటు

Jul 14 2014 11:01 AM | Updated on Oct 2 2018 8:39 PM

మెస్సీకి గోల్డెన్ బాల్, రోడ్రిగ్జ్కు గోల్డెన్ బూటు - Sakshi

మెస్సీకి గోల్డెన్ బాల్, రోడ్రిగ్జ్కు గోల్డెన్ బూటు

అర్జెంటీనా ఫైనల్లో ఓడిపోయినా.. గోల్డెన్ బాల్ మాత్రం ఏస్ క్రీడాకారుడు, ఆ టీమ్ కెప్టెన్ లియోనెల్ మెస్సీకే దక్కింది.

అర్జెంటీనా ఫైనల్లో ఓడిపోయినా.. గోల్డెన్ బాల్ మాత్రం ఏస్ క్రీడాకారుడు, ఆ టీమ్ కెప్టెన్ లియోనెల్ మెస్సీకే దక్కింది. 2014 ఫిఫా వరల్డ్ కప్కు గాను గోల్డెన్ బూట్ అవార్డును జేమ్స్ రోడ్రిగ్జ్ గెలుచుకున్నాడు. మార్కానా స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో జర్మనీ చేతుల్లో ఎక్స్ట్రా టైమ్లో అర్జెంటీనా 0-1 తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో మెస్సీ ఒక్క గోల్ కూడా చేయలేకపోయినా.. టోర్నమెంటు మొత్తమ్మీద అతడే మంచి ప్లేయర్ అని ఓటర్లంతా భావించారు. దాంతో గోల్డెన్ బాల్ అతడికే దక్కింది. జట్టు ఆడిన మొత్తం ఏడు మ్యాచ్లలోనూ పాల్గొన్న మెస్సీ (27) నాలుగు గోల్స్ కొట్టాడు. ఈ అవార్డుకు పోటీపడినవారిలో అర్జెన్ రాబెన్ (నెదర్లాండ్స్), నెయ్మార్ (బ్రెజిల్), జేమ్స్ రోడ్రిగ్జ్ (కొలంబియా), థామస్ ముల్లర్ (జర్మనీ) ఉన్నారు.

ఇక కొలంబియా జట్టుకు ఆరు గోల్స్ అందించిన రోడ్రిగ్జ్ గోల్డెన్ బూట్ గెలుచుకున్నాడు. ఇక ఐదు గోల్స్ చేసిన థామస్ ముల్లర్ వెండి బూటు గెలుచుకున్నాడు. టోర్నమెంటు మొత్తమ్మీద కేవలం నాలుగంటే నాలుగేసార్లు గోల్స్ ఇచ్చిన జర్మన్ గోల్ కీపర్ మాన్యుయెల్ నూయెర్ గోల్డెన్ గ్లోవ్ దక్కించుకున్నాడు.

అవార్డుల జాబితా ఇలా ఉంది..
గోల్డెన్ బాల్: లియోనెల్ మెస్సీ (అర్జెంటీనా), సిల్వర్ బాల్: థామస్ ముల్లర్ (జర్మనీ), బ్రాంజ్ బాల్: అర్జెన్ రాబెన్ (నెదర్లాండ్స్)
గోల్డెన్ బూటు: జేమ్స్ రోడ్రిగ్జ్ (కొలంబియా), సిల్వర్ బూటు: థామస్ ముల్లర్ (జర్మనీ), బ్రాంజ్ బూటుష్ట్ర నెయ్మార్ (బ్రెజిల్)
గోల్డెన్ గ్లోవ్: మాన్యుయెల్ నూయెర్ (జర్మనీ)
యంగ్ ప్లేయర్ అవార్డు: పాల్ పోగ్బా (ఫ్రాన్స్)
ఫిఫా ఫెయిర్ ప్లే ట్రోఫీ: కొలంబియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement