
భారత దిగ్గజ మహిళా బాక్సర్ మేరీకోమ్ ‘భారత బాక్సింగ్ జాతీయ పరిశీలకురాలు’ (నేషనల్ అబ్జర్వర్) పదవికి రాజీనామా చేసినట్లు వెల్లడించింది. కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్‌తో చర్చించిన తర్వాతే పదవిని విడిచిపెట్టినట్లు పేర్కొంది.
పరస్పర విరుద్ద ప్రయోజనాల (కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్) దృష్ట్యా ప్రస్తుతం కెరీర్ కొనసాగిస్తున్న అథ్లెట్లు ఈ పదవిలో ఉండరాదని కేంద్ర క్రీడాశాఖ పేర్కొన్న నేపథ్యంలో మేరీకోమ్ ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పింది.