గిరిజనుల అంబాసిడర్‌గా మేరీ కోమ్‌

Mary Kom named brand ambassador of Tribes India - Sakshi

న్యూఢిల్లీ: ఐదు సార్లు ప్రపంచ చాంపియన్‌ బాక్సర్‌ అయిన మేరీ కోమ్‌ భారత గిరిజనులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించనుంది. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం ఆమెను ప్రచారకర్తగా నియమించింది. ఆమె గతంలో రాజ్యసభ సభ్యురాలిగా పనిచేసిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో స్టార్‌ మహిళా బాక్సర్‌ మేరీ మాట్లాడుతూ ‘షెడ్యూల్డు తెగలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ కావడం చాలా సంతోషంగా ఉంది.మణిపూర్‌కు చెందిన నేను గిరిజనుల వృద్ధి, వికాసానికి నా వంతు సహకారం అందజేస్తాను. వాళ్లంతా ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా’ అని చెప్పింది.  ఇందులో భాగంగా గిరిజనులు, చేతివృత్తుల వారు తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శించారు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top