నా జీవితంలో ఆ రోజే చెడ్డది.. మంచిది : గప్టిల్‌

Martin Guptill Says World Cup Final Was Best and Worst Day of My Cricketing Life - Sakshi

ఇంగ్లండ్‌తో జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ తన జీవితంలోనే ఓ దుర్దినమని, అద్భుతం కూడా అని న్యూజిలాండ్‌ ఓపెనర్‌ మార్టిన్‌ గప్టిల్‌ తెలిపాడు. యాక‌్షన్‌ థ్రిల్లర్‌ను తలపించిన మెగా ఫైనల్‌ టై కావడం... అనంతరం నిర్వహించిన సూపర్‌ ఓవర్‌ కూడా టై కావడం.. బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లండ్‌ విశ్వవిజేతగా నిలవడం తెలిసిందే. అయితే గెలుపు ముంగిట నిలిచి దురదృష్టంతో కివీస్‌ టైటిల్‌ అందుకోకపోవడంలో గప్టిల్‌ది కాదనలేని పరోక్షపాత్ర. ఆద్యాంతం ఆకట్టుకున్న ఈ ఫైనల్‌ అనంతరం ఎక్కడా మాట్లాడని గప్టిల్‌ ఎట్టకేలకు మౌనం వీడాడు. మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందించాడు.

‘లార్డ్స్‌లో ఫైనల్‌ మ్యాచ్‌ జరిగి వారం పూర్తైందని నమ్మడానికి చాలా కష్టంగా ఉంది. నా క్రికెట్‌ జీవితంలో అది ఓ అద్భుతమైన దినం, అత్యంత దుర్దినంగా కూడా భావిస్తున్నాను. ఎన్నో విభిన్నమైన భావోద్వేగాలకు వేదికగా ఆ మ్యాచ్‌ నిలిచింది. కానీ న్యూజిలాండ్‌ తరఫున, గొప్ప సహచరులతో ఆడటాన్ని గర్వంగా ఫీలవుతున్నా. మద్దతు పలికిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇదో అద్భుతం.’ అని గప్టిల్‌ మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో పేర్కొన్నాడు.

టైటిల్‌ అందకుండా న్యూజిలాండ్‌ను దురదృష్టం గప్టిల్‌ రూపంలో వెంటాడింది. కివీస్‌ డెత్‌ బౌలర్లు ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ను భారీ షాట్లు కొట్టకుండా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి మ్యాచ్‌ చేతుల్లోకి తెచ్చుకున్నారు. ఆఖరి ఓవర్లో ఇంగ్లండ్‌ విజయానికి 3 బంతుల్లో 9 పరుగులు కావాలి. ఈ సమయంలో గప్టిల్‌ విసిరిన బంతి నేరుగా బెన్‌ స్టోక్స్‌ బ్యాట్‌కు తగిలి బౌండరీ వెళ్లింది. దీంతో అంపైర్లు ఇంగ్లండ్‌కు 6 పరుగులు ఇచ్చారు. ఇది మ్యాచ్‌ టై కి దారితీసింది. వాస్తవానికి ఇందులో గప్టిల్‌, స్టోక్స్‌ తప్పేం లేదు. ఇక సూపర్‌ ఓవర్‌లో కూడా మళ్లీ గప్టిల్‌ రూపంలోనే న్యూజిలాండ్‌ దురదృష్టం వెంటాడింది. చివరి బంతికి రెండు పరుగుల చేయాల్సిన సమయంలో గప్టిల్‌ రనౌట్‌ కావడం.. సూపర్‌ ఓవర్‌ కూడా టై కావడం.. బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లండ్‌ జగజ్జేతగా నిలవడం అలా జరిగిపోయింది. ఈ రెండింటిలోను గప్టిల్‌ ప్రత్యక్ష పాత్ర లేకపోయినప్పటికి పరోక్ష పాత్ర కాదనలేనిది. ఇక ఈ మెగాటోర్నీలో గప్టిల్‌ తనస్థాయి దగ్గ ప్రదర్శన ఇవ్వలేదు. 10 మ్యాచ్‌ల్లో కేవలం 186 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

22-07-2019
Jul 22, 2019, 14:46 IST
ఫైనల్‌కు ముందు ఓటమి భయం తనని వెంటాడిందని, ఓడితే మళ్లీ ఏ ముఖం పెట్టుకొని క్రికెట్‌ ఆడాలని
21-07-2019
Jul 21, 2019, 17:46 IST
దుబాయ్‌: వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఓవర్‌ త్రో విషయంలో తాను పొరపాటు చేశానని ఆ మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించిన...
21-07-2019
Jul 21, 2019, 16:12 IST
దిగ్గజ క్రికెటర్‌ ధోనికి ఎప్పుడు రిటైర్‌ అవ్వాలనే విషయం తెలుసు. కానీ మేం మా భవిష్యత్తు ప్రణాళికలను
20-07-2019
Jul 20, 2019, 19:44 IST
కెట్‌ ఆటతో కోట్లకు కోట్లు సంపాదించే ఆటగాళ్లు.. ఇలా కేవలం ట్వీట్లతో సరిపెట్టడం
20-07-2019
Jul 20, 2019, 15:27 IST
ప్రపంచకప్‌ ఫైనల్లో చోటుచేసుకున్న అనూహ్య ఘటనతో ..
19-07-2019
Jul 19, 2019, 15:04 IST
ప్రస్తుత పరిస్థితిపై ఉద్వేగానికి లోనవ్వకుండా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని
18-07-2019
Jul 18, 2019, 15:42 IST
బౌండరీల ఆధారంగా విజేతను ప్రకటించడం ఓ చెత్త నిర్ణయం
18-07-2019
Jul 18, 2019, 13:21 IST
వన్డే ప్రపంచకప్‌లో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ జేమ్స్‌ నీషమ్‌ అత్యంత కీలక ఇన్నింగ్స్‌  ఆడుతుండగా..
17-07-2019
Jul 17, 2019, 22:14 IST
లండన్‌ : ప్రపంచకప్‌-2019లో తన విధ్వంసకర ఆటతీరుతో విమర్శకులచే ప్రశంసలు అందుకున్నాడు ఇంగ్లండ్‌ స్టార్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌. అంతేకాకుండా...
17-07-2019
Jul 17, 2019, 19:54 IST
ఫిట్‌నెస్‌ లేదు.. ఫామ్‌ లేదు.. అయినా జట్టులో ఎందుకు ఉంటారో అర్థం కావడం లేదు. వెళ్లిపోవచ్చు కదా!
17-07-2019
Jul 17, 2019, 16:24 IST
లండన్‌: ప్రపంచకప్ ఫైనల్లో చోటు చేసుకున్న ‘బెన్ స్టోక్స్.. ఓవర్‌త్రో’పై పెద్ద చర్చే జరుగుతోంది. ఈ అదనపు పరుగులతోనే ఇంగ్లండ్‌...
17-07-2019
Jul 17, 2019, 13:47 IST
బౌండరీ విధానంతో వన్డే ప్రపంచకప్‌ విజేతను ప్రకటించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతునూ ఉన్నాయి.
17-07-2019
Jul 17, 2019, 12:55 IST
న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌పై టీమిండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు.
17-07-2019
Jul 17, 2019, 12:33 IST
టీమిండియా క్రికెటర్‌ రోహిత్‌ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా...
17-07-2019
Jul 17, 2019, 08:44 IST
ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ‘ఫేస్‌ యాప్‌’  విపరీతంగా ట్రెండ్‌ అవుతోంది. భవిష్యత్తులో, ముఖ్యంగా వృద్ధాప్యంలో వ్యక్తులు ఎలా ఉంటారో ఈ...
17-07-2019
Jul 17, 2019, 07:57 IST
లండన్‌ : సొంతగడ్డపై వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకున్న ఇంగ్లండ్‌ విజయ సంబరాలు కొనసాగుతూనే ఉన్నాయి. తొలిసారి తమ దేశానికి...
17-07-2019
Jul 17, 2019, 02:47 IST
వెల్లింగ్టన్‌: ప్రపంచ కప్‌ ఫైనల్లో ఫలితాన్ని తేల్చిన తీరుపై న్యూజిలాండ్‌ వైపు నుంచి స్పందనలు కొనసాగుతూనే ఉన్నాయి. జట్టు కెప్టెన్‌...
16-07-2019
Jul 16, 2019, 15:42 IST
లండన్‌: వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఆఖరి ఓవర్‌లో ఓవర్‌ త్రో అయిన బంతికి ఇంగ్లండ్‌కు ఆరు పరగులు కాకుండా ఐదు...
16-07-2019
Jul 16, 2019, 14:28 IST
ఓవర్‌ త్రో వివాదంపై మాట్లాడటానికి అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ)
16-07-2019
Jul 16, 2019, 14:07 IST
న్యూఢిల్లీ: క్రికెటర్ల ప్రదర్శన ఆధారంగా తమ అత్యుత్తమ జట్టును ప్రకటించడం దిగ్గజ క్రికెటర్ల ఆనవాయితీ.  వరల్డ్‌కప్‌కు ముందు పలువురు దిగ్గజ...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top