రన్నరప్ సుమీత్ జంట | Manu-Sumeet pair finishes runners-up at Prague Open | Sakshi
Sakshi News home page

రన్నరప్ సుమీత్ జంట

Sep 29 2015 12:11 AM | Updated on Sep 3 2017 10:08 AM

రన్నరప్ సుమీత్ జంట

రన్నరప్ సుమీత్ జంట

ఈ ఏడాది నిలకడగా రాణిస్తోన్న భారత నంబర్‌వన్ పురుషుల బ్యాడ్మింటన్ జంట సుమీత్ రెడ్డి-మనూ అత్రి త్రుటిలో మరో టైటిల్‌ను కోల్పోయింది.

ప్రేగ్ (చెక్ రిపబ్లిక్): ఈ ఏడాది నిలకడగా రాణిస్తోన్న భారత నంబర్‌వన్ పురుషుల బ్యాడ్మింటన్ జంట సుమీత్ రెడ్డి-మనూ అత్రి త్రుటిలో మరో టైటిల్‌ను కోల్పోయింది. ప్రేగ్ బ్యాడ్మింటన్ ఓపెన్‌లో హైదరాబాద్ ప్లేయర్ సుమీత్ రెడ్డి, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన తన భాగస్వామి మనూ అత్రితో కలిసి రన్నరప్‌గా నిలిచాడు. హోరాహోరీగా జరిగిన పురుషుల డబు ల్స్ ఫైనల్లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి ద్వయం 21- 19, 20-22, 14-21తో ఆడమ్ క్వాలినా-ప్రెజ్మీస్లా వచా (పోలండ్) జోడీ చేతిలో ఓడిపోయింది.

రెండో గేమ్‌లో మ్యాచ్ పాయింట్‌ను వదులుకున్న సుమీత్-మనూ అత్రి, నిర్ణాయక మూడో గేమ్‌లో తడబడి మూల్యం చెల్లించుకున్నారు. ఇటీవల లాగోస్ ఓపెన్, బెల్జియం ఇంటర్నేషనల్ ఓపెన్‌లో టైటిల్స్ నెగ్గిన సుమీత్-మనూ యూఎస్ ఓపెన్‌లో, గ్వాటెమాలా చాలెంజ్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచారు.

Advertisement
 
Advertisement
Advertisement