మనోజ్‌కు టైటిల్ | manoj gets power lifting championship | Sakshi
Sakshi News home page

మనోజ్‌కు టైటిల్

Jul 18 2016 10:30 AM | Updated on Sep 4 2018 5:21 PM

హైదరాబాద్ జిల్లా సీనియర్ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో మనోజ్ 66 కేజీ కేటగిరీలో 490 కేజీల బరువెత్తి విజేతగా నిలిచాడు.

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా సీనియర్ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో మనోజ్ 66 కేజీ కేటగిరీలో 490 కేజీల బరువెత్తి విజేతగా నిలిచాడు. శివ కుమార్ 440 కేజీల బరువెత్తి రజతం, ఓంప్రసాద్ (420 కేజీలు) కాంస్యం నెగ్గారు. 74 కేజీ కేటగిరీలో జానకిరామ్ 637.5 కేజీల బరువెత్తి బంగారు పతకం సాధించాడు. రమేష్ (575 కేజీలు), చంద్రకాంత్ (437.5 కేజీలు) వరుసగా రజతం, కాంస్యం గెలిచారు. మహిళల 72 కేజీ కేటగిరీలో నిత్య స్వర్ణం నెగ్గింది.


 ఇతర విభాగాల విజేతలు


 59 కేజీ కేటగిరీ: 1. కుమార్ (500 కేజీలు), 2. శ్రీశైలం (360 కేజీలు); 83 కేజీ కేటగిరీ: 1. చందర్ శంకర్ (662.5 కేజీలు), 2. బాలకృష్ణ (502.5 కేజీలు); 93 కేజీ కేటగిరీ: 1. శ్రీనివాస్ (625 కేజీలు), 2. శ్రీకాంత్ (480 కేజీలు); 105 కేజీ కేటగిరీ: 1. కార్తి (582.5 కేజీలు), 2. రాజత్ సింగ్ (375 కేజీలు); ప్లస్ 120 కేజీ కేటగిరీ: 1. సుమిత్ (747.5 కేజీలు).

Advertisement
 
Advertisement
Advertisement