మాంచెస్టర్ పేసర్ మోహిత్ కుమార్ (5/15) నిప్పులు చెరిగే బౌలింగ్‌తో ఆక్స్‌ఫర్డ్ బ్లూస్ బ్యాట్స్‌మెన్‌ను వణికించాడు.
సాక్షి, హైదరాబాద్: మాంచెస్టర్ పేసర్ మోహిత్ కుమార్ (5/15) నిప్పులు చెరిగే బౌలింగ్‌తో ఆక్స్‌ఫర్డ్ బ్లూస్ బ్యాట్స్‌మెన్‌ను వణికించాడు. ఎ–డివిజన్ రెండు రోజుల లీగ్‌లో మాంచెస్టర్ 205 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదటి రోజు మాంచెస్టర్ జట్టు 263 పరుగుల వద్ద ఆలౌటైంది. మహేశ్వర్ (62) రాణించగా, అశ్వద్ రాజీవ్ 6 వికెట్లు తీశాడు. తర్వాత రెండో రోజు బుధవారం లక్ష్యఛేదనకు దిగిన అక్స్‌ఫర్డ్ బ్లూస్ జట్టు 58 పరుగులకే కుప్పకూలింది. మోహిత్‌తో పాటు, విజేందర్ (4/13) ధాటికి ఎవరూ క్రీజులో నిలువలేకపోయారు.
ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
మెగా సిటీ: 120/8 (అర్జున్ 3/13), బాలాజీ సీసీ: 121/2 (సిద్ధార్థ్ నాయుడు 65, వంశీ రాఘవ్ 45).
జిందా తిలిస్మాత్: 452/9 డిక్లేర్డ్ (అసదుద్దీన్ 132; మొయిజ్ ఇక్బాల్ 88 నాటౌట్, అజార్ అలీ 90, రాజ్ మిశ్రా 56; క్రౌన్ సీసీ: 158 (పియూష్ జోషి 36; విష్ణు చైతన్య 3/40).
క్లాసిక్ సీసీ: 151, ఉస్మానియా: 120 (నవీన్ కుమార్ 37; శ్రీనికేత్ 3/33).