breaking news
blues
-
మళ్లీ ‘బ్లూ’ జెర్సీతో...
న్యూఢిల్లీ: ఎన్నో ఏళ్లుగా భారత హాకీ జట్టుకు గుర్తింపుగా ఉన్న ‘బ్లూ’ జెర్సీని వదిలి ఇటీవల ప్రపంచకప్‌లో మన టీమ్ కాషాయం రంగు జెర్సీతో బరిలోకి దిగింది. దాంతో ఈ అంశం వివాదాస్పదం కాగా, హాకీ ఇండియా (హెచ్ఐ)లో విభేదాలు కూడా బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో భారత జట్టు ఇప్పుడు మళ్లీ పాత రంగుకే ఓటు వేసింది. ఆసియా క్రీడల్లో మన టీమ్ ఎప్పటిలాగే నీలిరంగు జెర్సీతో బరిలోకి దిగనుంది. ఈ విషయాన్ని హాకీ ఇండియా (హెచ్ఐ) అధ్యక్షుడు దిలీప్ తిర్కీ ఖరారు చేశారు. ‘ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్టు కిట్ రంగు విషయంలో మా ప్రాధాన్యత వెల్లడించాలని ఒలింపిక్ సంఘం కోరింది. మేం తొలి ప్రాధాన్యతంగా నీలి రంగును ఎంపిక చేసుకున్నాం. కాషాయం రంగు శాశ్వతం కాదని, మున్ముందు మారవచ్చని వరల్డ్ కప్ సమయంలోనే నేను చెప్పాను. ఇప్పుడు నీలి రంగు మళ్లీ వచ్చింది. భారత హాకీ టీమ్ ‘బ్లూ’తో బరిలోకి దిగుతుంది’ అని తిర్కీ స్పష్టం చేశారు. వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరిగిన టర్ఫ్‌లు నీలి రంగులో ఉండటంతో మన జెర్సీ రంగు కలిసిపోయి ఆటగాళ్లకు ఇబ్బంది అవుతుందని భావిస్తూ రంగు మార్చామంటూ నాడు హెచ్ఐ వివరణ ఇచ్చింది. కానీ దీనిపై అన్ని వైపులనుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రపంచ కప్‌ను ఎనిమిదో స్థానంతో ముగించిన భారత జట్టుకు ఆసియా క్రీడలకు కీలకం కానున్నాయి. ఇక్కడి ప్రదర్శనను బట్టి 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌కు జట్టు అర్హత సాధించేందుకు అవకాశం ఉంది. -
మోహిత్ ధాటికి బ్లూస్ విలవిల
సాక్షి, హైదరాబాద్: మాంచెస్టర్ పేసర్ మోహిత్ కుమార్ (5/15) నిప్పులు చెరిగే బౌలింగ్‌తో ఆక్స్ఫర్డ్ బ్లూస్ బ్యాట్స్‌మెన్‌ను వణికించాడు. ఎ–డివిజన్ రెండు రోజుల లీగ్‌లో మాంచెస్టర్ 205 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదటి రోజు మాంచెస్టర్ జట్టు 263 పరుగుల వద్ద ఆలౌటైంది. మహేశ్వర్ (62) రాణించగా, అశ్వద్ రాజీవ్ 6 వికెట్లు తీశాడు. తర్వాత రెండో రోజు బుధవారం లక్ష్యఛేదనకు దిగిన అక్స్‌ఫర్డ్ బ్లూస్ జట్టు 58 పరుగులకే కుప్పకూలింది. మోహిత్‌తో పాటు, విజేందర్ (4/13) ధాటికి ఎవరూ క్రీజులో నిలువలేకపోయారు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు మెగా సిటీ: 120/8 (అర్జున్ 3/13), బాలాజీ సీసీ: 121/2 (సిద్ధార్థ్ నాయుడు 65, వంశీ రాఘవ్ 45). జిందా తిలిస్మాత్: 452/9 డిక్లేర్డ్ (అసదుద్దీన్ 132; మొయిజ్ ఇక్బాల్ 88 నాటౌట్, అజార్ అలీ 90, రాజ్ మిశ్రా 56; క్రౌన్ సీసీ: 158 (పియూష్ జోషి 36; విష్ణు చైతన్య 3/40). క్లాసిక్ సీసీ: 151, ఉస్మానియా: 120 (నవీన్ కుమార్ 37; శ్రీనికేత్ 3/33).


