
ది హాండ్రడ్ లీగ్-2025 టోర్నీని మాంచెస్టర్ ఒరిజినల్స్ విజయంతో ముగించింది. ఈ టోర్నీలో భాగంగా మంగళవారం లీడ్స్ వేదికగా నార్తరన్ సూపర్ ఛార్జర్స్‌తో జరిగిన తమ ఆఖరి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో మాంచెస్టర్ ఒరిజినల్స్ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ ఛార్జర్స్ నిర్ణీత వంద బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది.
నార్తర్న్ బ్యాటర్లలో సమిత్ పటేల్ (19 బంతుల్లో 42 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలవగా... డేవిడ్ మిల్లర్ (22 బంతుల్లో 30 పరుగులు), హ్యారీ బ్రూక్(20) రాణించారు. ఒరిజినల్స్ బౌలర్లలో థామస్ ఆస్పిన్‌వాల్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఆండర్సన్, టంగ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు స్కాట్ క్యూరీ ఓ వికెట్ సాధించారు.
జోస్ బట్లర్ విధ్వంసం..
అనంతరం 140 పరుగుల లక్ష్యాన్ని మాంచెస్టర్ ఒరిజినల్స్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 84 బంతుల్లో చేధించింది. ఈ లక్ష్య చేధనలో మాంచెస్టర్ వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ విధ్వంసం సృష్టించాడు. లీడ్స్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు.
కేవలం 37 బంతుల్లోనే 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 70 పరుగులు చేశాడు. అతడితో పాటు రచిన్ రవీంద్ర కూడా బ్యాట్ ఝూళిపించాడు. రవీంద్ర 23 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగుల చేసి ఆజేయంగా నిలిచాడు. నార్తర్న్ బౌలర్లలో జాకబ్ డఫీ, టామ్ లాస్, ఆదిల్ రషీద్ లు తలా ఓ వికెట్ సాధించారు. కాగా మాంచెస్టర్ ఒరిజినల్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నిష్క్రమించింది.
That's 50 runs for Jos Buttler, and he's still going! 🤯#TheHundred | #RoadToTheEliminator pic.twitter.com/4WaDHnNR3s
— The Hundred (@thehundred) August 26, 2025