ప్రపంచ చాంపియన్‌షిప్‌కు మల్లికా | Mallika Yadav To World Championship | Sakshi
Sakshi News home page

ప్రపంచ చాంపియన్‌షిప్‌కు మల్లికా

Sep 4 2019 2:05 PM | Updated on Sep 4 2019 2:05 PM

Mallika Yadav To World Championship - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నవంబర్‌ 18 నుంచి 23 వరకు దుబాయ్‌లో జరిగే సీనియర్‌ వరల్డ్‌ పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌కు ఎంపికైన మల్లికా యాదవ్‌ను తెలంగాణ క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ మినిస్టర్‌ క్వార్టర్స్‌లో మంగళవారం అభినందించారు. పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనడానికి తనకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాల్సిందిగా మల్లికా యాదవ్‌ మంత్రిని అభ్యర్థించింది.

దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చూస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శాట్స్‌ చైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌ రెడ్డి, ఆసియా చాంపియన్‌ పవర్‌ లిఫ్టర్‌ రాఘవేందర్‌ గౌడ్‌  పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement