లిన్‌, నరైన్‌లు వచ్చేశారు..

Lynn, Narine come back for KKR - Sakshi

కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) సీజన్‌ 12లో భాగంగా స్థానిక ఈడెన్‌ గార్డెన్‌ మైదానంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన సీఎస్‌కే తొలుత ఫీల్డింగ్‌ ఎంచకుంది. టాస్‌ గెలిచిన సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని.. ముందుగా కేకేఆర్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. కింగ్స్‌ పంజాబ్‌తో  ఇప్పటివరకు ఈ సీజన్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడిన చెన్నై.. ఆరు మ్యాచ్‌ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, కోల్‌కతా ఏడు మ్యాఛ్‌లకు గాను నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించి రెండో స్థానంలో ఉంది.

గురువారం రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ గెలవగా, శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఓటమి పాలైంది. ప్రధానంగా ఓపెనర్లు క్రిస్‌ లిన్‌, సునీల్‌ నరైన్‌లు విశ్రాంతినిచ్చి గత మ్యాచ్‌లో ప్రయోగం చేసిన కోల్‌కతా అందుకు తగిన మూల్యం చెల్లించుకుంది. దాంతో వారిని తాజా మ్యాచ్‌లో లిన్‌, నరైన్‌లకు తుది జట్టులో చోటు కల్పించారు. ఇదిలా ఉంచితే, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది.

కేకేఆర్‌
దినేశ్‌ కార్తీక్‌(కెప్టెన్‌), సునీల్‌ నరైన్‌, క్రిస్‌ లిన్‌, రాబిన్‌ ఊతప్ప, నితీశ్‌ రాణా, ఆండ్రీ రసెల్‌, శుభ్‌మన్‌ గిల్‌, పీయూష్‌ చావ్లా, కుల్దీప్‌ యాదవ్‌, ప్రసీద్ద్‌ కృష్ణ, గర్నీ

చెన్నై
ఎంఎస్‌ ధోని(కెప్టెన్‌), షేన్‌ వాట్సన్‌, డుప్లెసిస్‌, సురేశ్‌ రైనా, అంబటి రాయుడు, కేదార్‌ జాదవ్‌, రవీంద్ర జడేజా, మిచెల్‌ సాంట్నార్‌, దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, ఇమ్రాన్‌ తాహీర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top