‘లోధా’ ప్రతిపాదనలపై బీసీసీఐ అఫిడవిట్ | 'Lodha' proposals BCCI affidavit | Sakshi
Sakshi News home page

‘లోధా’ ప్రతిపాదనలపై బీసీసీఐ అఫిడవిట్

Mar 3 2016 12:26 AM | Updated on Sep 2 2018 5:24 PM

జస్టిస్ లోధా కమిటీ సూచించిన ప్రతిపాదనలకు వ్యతిరేకంగా బీసీసీఐ తమ చివరి ప్రయత్నాలను ప్రారంభించింది.

న్యూఢిల్లీ:  జస్టిస్ లోధా కమిటీ సూచించిన ప్రతిపాదనలకు వ్యతిరేకంగా  బీసీసీఐ తమ చివరి ప్రయత్నాలను ప్రారంభించింది. ఈమేరకు మంగళవారం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ప్యానెల్ సూచించినట్టుగా బోర్డును పునర్‌నిర్మించడంపై తమకున్న అభ్యంతరాలను అందులో పేర్కొంది. ‘ఒక రాష్ర్టం.. ఒక ఓటు’ సూచనపై ఇతర రాష్ట్ర యూనిట్లు అసంతృప్తితో ఉన్నాయని పేర్కొంది. 60 పేజీలతో కూడిన తమ అఫిడవిట్‌ను బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ సుప్రీంలో దాఖలు చేశారు. మంత్రులు, ప్రభుత్వ అధికారులు ఎలాంటి పదవులు చేపట్టకుండా నిరోధించాలనే ప్రతిపాదన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1) (సి)ని ఉల్లంఘించినట్టే అవుతుందని గుర్తుచేసింది. అలాగే ఆఫీస్ బేరర్ల గరిష్ట వయస్సుపై, సెలక్టర్ల సంఖ్య తగ్గింపుపై కూడా తమ వాదనలను అందులో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement