హమ్మయ్య.. పేస్‌కు పార్ట్‌నర్ దొరికాడు! | leander paes to play with rohan bopanna in rio olympics | Sakshi
Sakshi News home page

హమ్మయ్య.. పేస్‌కు పార్ట్‌నర్ దొరికాడు!

Jun 11 2016 2:12 PM | Updated on Sep 4 2017 2:15 AM

హమ్మయ్య.. పేస్‌కు పార్ట్‌నర్ దొరికాడు!

హమ్మయ్య.. పేస్‌కు పార్ట్‌నర్ దొరికాడు!

రియో ఒలింపిక్స్‌లో ఎట్టకేలకు భారత సీనియర్ ప్లేయర్ లియాండర్ పేస్‌కు ఊరట లభించింది. అతడికి ఒక పార్ట్‌నర్‌ దొరికాడు.

రియో ఒలింపిక్స్‌లో ఎట్టకేలకు భారత సీనియర్ ప్లేయర్ లియాండర్ పేస్‌కు ఊరట లభించింది. అతడికి ఒక పార్ట్‌నర్‌ దొరికాడు. రోహన్ బోపన్న ఈ ఒలింపిక్స్‌లో పేస్‌తో కలిసే ఆడాలని ఆలిండియా టెన్నిస్ సంఘం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని అసోసియేషన్ ప్రతినిధి అనిల్ ఖన్నా తెలిపారు. నిజానికి బోపన్న తాను సాకేత్ మైనేనితో కలిసి ఆడతానని ఇంతకుముందు చెప్పిన విషయం తెలిసిందే. బోపన్నకు పేస్ అంటే గౌరవం ఉందని.. అయితే అతడు సాకేత్‌తో కలిసి ఎందుకు ఆడాలనుకున్నాడో తమకు వివరించాడని ఖన్నా చెప్పారు. సెలెక్షన్ కమిటీ మాత్రం పురుషుల డబుల్స్‌ విభాగంలో బోపన్న - పేస్ కలిసి ఆడాలని నిర్ణయించింది.

ఇక మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న, సానియా మీర్జా కలిసి ఆడతారు. సానియా ముందుగానే బోపన్నను ఎంచుకున్న విషయం తెలిసిందే. దానికి తగ్గట్లుగానే అసోసియేషన్ కూడా నిర్ణయం తీసుకుంది. ఇక మహిళల డబుల్స్ విభాగంలో సానియా మీర్జా - ప్రార్థనా తాంబారే కలిసి ఆడతారని అనిల్ ఖన్నా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement