రెండో స్థానంలో లలిత్‌బాబు | Lalith Babu former national champion G Akash | Sakshi
Sakshi News home page

రెండో స్థానంలో లలిత్‌బాబు

Jul 2 2018 10:13 AM | Updated on Jul 2 2018 10:13 AM

Lalith Babu former national champion G Akash - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కామన్వెల్త్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ఎం.ఆర్‌ లలిత్‌బాబు సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఢిల్లీలోని లీలా అంబియెన్స్‌ కన్వెన్షన్‌ హోటల్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో ఏడు రౌండ్లు ముగిసేసరికి 5.5 పాయింట్లతో లలిత్‌ మరో నలుగురితో కలిసి రెండో స్థానంలో నిలిచాడు. ఆదివారం జరిగిన ఏడో రౌండ్‌లో మాజీ జాతీయ చాంపియన్‌ జి. ఆకాశ్‌పై లలిత్‌బాబు విజయం సాధించాడు. సంకల్ప్‌ గుప్తా, దేబాశిష్‌ దాస్, పి. కార్తీకేయన్, నుబర్షా షేక్‌ కూడా 5.5 పాయింట్లతో ఉన్నారు. ఆరు పాయింట్లు సాధించిన వైభవ్, నితిన్‌ ప్రస్తుతం ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement