ఐపీఎల్‌: గెలిచేది.. నిలిచేదెవరు? | KXIP Won The Toss And Choose To Field | Sakshi
Sakshi News home page

May 16 2018 7:46 PM | Updated on May 16 2018 8:01 PM

KXIP Won The Toss And Choose To Field - Sakshi

ముంబై : ఐపీఎల్‌-11 సీజన్‌లో భాగంగా మరో రసవత్తర పోరుకు వాంఖేడే మైదానం వేదికైంది. ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్‌ కెప్టెన్‌ రవించంద్రస్‌ అ‍శ్విన్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. ఇక ఇరుజట్లలో స్పల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పంజాబ్‌లో మయాంక్‌ అగర్వాల్‌, కరుణ్‌ నాయర్‌ స్థానంలో యువరాజ్‌ సింగ్‌, మనోజ్‌ తివారీ తుది జట్టులోకి రాగా.. ముంబై జట్టులో జేపీ డుమినీ స్థానంలో కీరన్‌ పోలార్డ్‌ వచ్చాడు.  ఈ కీలక మ్యాచ్‌లో ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు ప్లే ఆఫ్‌ రేసులో నిలుస్తోంది.

కింగ్స్‌పంజాబ్‌కు మరో అవకాశం ఉండగా.. ముంబైకి మాత్రం ఆ అవకాశం లేదు. రోహిత్‌ సేనకు ఇది చావోరేవో మ్యాచ్‌. 12 మ్యాచ్‌లు ఆడిన ముంబై 5 మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలో కొనసాగుతోంది. పంజాబ్‌ 12 మ్యాచ్‌లకు 6 గెలిచి ఐదో స్థానంలో నిలిచింది. రాయల్స్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో ఊహించని రీతిలో చిత్తుగా ఓడిన పంజాబ్‌.. ఆ ఓటమి నుంచి తేరుకోని విజయం సాధించాలని భావిస్తోంది. ఇక వరుస పరాజయాలతో ఓ దశలో అట్టుడుగు స్థానానికి పడిపోయిన ముంబై అనూహ్యంగా హ్యాట్రిక్‌ విజయం సాధించి ప్లే ఆఫ్‌ రేసులో నిలిచింది. అయితే గత ఆదివారం రాజస్తాన్‌ రాయల్స్‌, ముంబై జైతయాత్రకు అడ్డుకట్ట వేయడంతో ప్లే ఆఫ్‌ ఆశలు సంక్లిష్టమయ్యాయి. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైన గెలవాలని రోహిత్‌ సేన ఉవ్విళ్లూరుతోంది. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్‌లో ముంబైనే విజయం వరించింది.

తుదిజట్లు
కింగ్స్‌ పంజాబ్‌ : రవిచంద్రన్‌ అశ్విన్‌(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, క్రిస్‌ గేల్‌, ఆరోన్‌ ఫించ్‌, యువరాజ్‌ సింగ్‌, మనోజ్‌ తివారీ, మార్కస్‌ స్టోయినిస్‌, అక్షర్‌ పటేల్‌, ఆండ్రూ టై, మోహిత్‌ శర్మ, అంకిత్‌ రాజ్‌పుత్‌

ముంబై ఇండియన్స్‌: రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), సూర్యకుమార్‌ యాదవ్‌, ఎవిన్‌ లూయిస్‌, ఇషాన్‌ కిషాన్‌, హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యా, కీరన్‌ పొలార్డ్‌, బెన్‌ కట్టింగ్‌, మిచెల్‌ మెక్‌గ్లాన్‌, మయాంక్‌ మార్కండే, జస్ప్రిత్‌ బుమ్రా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement