సంగక్కర సునామీ ఇన్నింగ్స్ | Kumar Sangakkara glitz in Cricket All-Stars Series | Sakshi
Sakshi News home page

సంగక్కర సునామీ ఇన్నింగ్స్

Nov 12 2015 9:08 AM | Updated on Sep 3 2017 12:23 PM

సంగక్కర సునామీ ఇన్నింగ్స్

సంగక్కర సునామీ ఇన్నింగ్స్

అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పినా తనలో సత్తా తగ్గలేదని శ్రీలంక దిగ్గజ బ్యాట్స్ మన్ కుమార సంగక్కర నిరూపించాడు.

హూస్టన్: అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పినా తనలో సత్తా తగ్గలేదని శ్రీలంక దిగ్గజ బ్యాట్స్ మన్ కుమార సంగక్కర నిరూపించాడు. ఆల్ స్టార్ క్రికెట్ టి20 సిరీస్ లో భాగంగా సచిన్ బ్లాస్టర్స్ తో గురువారం జరుగుతున్న రెండో మ్యాచ్ లో సంగక్కర చెలరేగాడు. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. సంగక్కర వీరవిహారంతో వార్న్ టీమ్ భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన వార్న్ వారియర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 262 పరుగులు చేసింది. సచిన్ సేనకు 263 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది.

సంగక్కర 30 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 70 పరుగులు చేశాడు. రికీ పాంటింగ్ 16 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 41 పరుగులు సాధించాడు. కల్లిస్ 45(23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు), హేడన్ 32(15 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు), వాగన్ 30(22 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్), సైమండ్స్ 19(6 బంతుల్లో ఫోర్, 2 సిక్సర్లు) చెలరేగడంతో వార్న్ సేన భారీ స్కోరు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement