హైదరాబాద్: బ్యాట్స్మన్లు అందరూ పెవిలియన్‌కు వరుస కట్టిన తరుణంలో అతడు ఎదురొడ్డినిలిచాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లను దీటుగా ఎదుర్కొని తన టీమ్‌కు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. విజయంలో కీలకపాత్ర పోషించి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. అతడే ముంబై ఇండియన్స్ ఆటగాడు కృనాల్ పాండ్యా. ఆదివారం రాత్రి రైజింగ్ పుణే సూపర్ జెయింట్‌తో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో కృనాల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో ముంబై ఆటగాళ్లలో అతడిదే టాప్ స్కోరు. కృనాల్ సమయోచిత బ్యాటింగ్‌కు తోడు బౌలర్ల ప్రతిభ తోడవడంతో ముంబై ఐపీఎల్-10 విజేతగా నిలిచింది.
జట్టు విజయంలో ప్రధాన భూమిక పోషించిన కృనాల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. టీమిండియాలో చోటుదక్కించుకోకుండా ఐపీఎల్ ఫైనల్లో ‘మ్యాన్ ఆఫ్ మ్యాచ్’ అవార్డు అందుకున్న రెండో ఆటగాడిగా అతడు గుర్తింపు పొందాడు. కృనాల్ కంటే ముందు మన్విందర్ బిస్లా ఈ ఘనత సాధించాడు. ఇంతకుముందు ఐపీఎల్ ఫైనల్లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్నవాళ్లందరూ టీమిండియా తరపున ఆడినవారే కావడం విశేషం. రెండుసార్లు మాత్రమే విదేశీ ఆటగాళ్లు ఈ అవార్డు దక్కించుకున్నారు.
ఐపీఎల్ ఫైనల్లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’లు అందుకున్నవారు
2008: యూసఫ్ పఠాన్(రాజస్తాన్ రాయల్స్)
2009: అనిల్ కుంబ్లే(రాయల్ చాలెంజర్స్ బెంగళూరు)
2010: సురేశ్ రైనా(చెన్నై సూపర్‌కింగ్స్)
2011: మురళీ విజయ్(చెన్నై సూపర్‌కింగ్స్)
2012: మన్విందర్ బిస్లా(కోల్‌కతా నైట్‌రైడర్స్)
2013: కీరన్ పొలార్డ్(ముంబై ఇండియన్స్)
2014: మనీశ్ పాండే(కోల్‌కతా నైట్‌రైడర్స్)
2015: రోహిత్ శర్మ(ముంబై ఇండియన్స్)
2016: బెన్ కటింగ్(సన్‌రైజర్స్ హైదరాబాద్)
కృనాల్ పాండ్యా అరుదైన ఘనత
Published Mon, May 22 2017 9:12 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్‌కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్‌ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement