కొంగర ప్రీతికి రెండు టైటిళ్లు | Kongara Preeti Got Two Sailing Titles | Sakshi
Sakshi News home page

కొంగర ప్రీతికి రెండు టైటిళ్లు

Jul 13 2019 2:18 PM | Updated on Jul 13 2019 2:18 PM

Kongara Preeti Got Two Sailing Titles - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సెయిలింగ్‌ రెగెట్టా చాంపియన్‌షిప్‌లో ప్రీతి కొంగర సత్తా చాటింది. యాట్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో హుస్సేన్‌సాగర్‌లో జరిగిన ఈ టోర్నమెంట్‌లో ప్రీతి సబ్‌ జూనియర్‌ బాలికల చాంపియన్‌షిప్‌ టైటిల్‌తో పాటు, తెలంగాణ రాష్ట్ర సబ్‌జూనియర్‌ చాంపి యన్‌గా అవతరించి మరో టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. జూనియర్‌ విభాగంలో సిఖాన్షు సింగ్‌ తెలంగాణ ఓపెన్‌ జూనియర్‌ చాంపియన్‌గా నిలిచాడు. బి.కిరణ్‌కు తెలంగాణ రాష్ట్ర జూనియర్‌ చాంపియన్‌ టైటిల్‌ దక్కింది.

సబ్‌ జూనియర్‌ ఆప్టిమిస్ట్‌ లైట్‌ కేటగిరీలో కె. నందిని విజేతగా నిలవగా... సోమ్‌నాథ్‌ రాథోడ్‌ తెలంగాణ రాష్ట్ర సబ్‌ జూనియర్‌ లైట్‌ ఫ్లీట్‌ చాంపియన్‌గా అవతరించాడు. ఓవరాల్‌గా టోర్నమెంట్‌లో జరిగిన 12 రేసుల్లో ఏడింటిలో విజేతగా నిలిచిన ప్రీతి కొంగర (హైదరాబాద్‌ యాట్‌ క్లబ్‌)  16 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. యాట్‌ క్లబ్‌కే చెందిన లక్ష్మీ నూకరత్నం 51 పాయింట్లతో రన్నరప్‌గా నిలవగా... ఝాన్సీ ప్రియ 54 పాయింట్లతో కాంస్య పతకాన్ని దక్కించుకుంది. బహుమతి ప్రదాన కార్యక్రమంలో నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement