కోనేరు హంపికి పదో స్థానం | Koneru Humpy one-tenth of a point | Sakshi
Sakshi News home page

కోనేరు హంపికి పదో స్థానం

Dec 29 2016 12:06 AM | Updated on Sep 4 2017 11:49 PM

కోనేరు హంపికి పదో స్థానం

కోనేరు హంపికి పదో స్థానం

ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి పదో స్థానాన్ని సంపాదించింది.

ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి పదో స్థానాన్ని సంపాదించింది. దోహాలో బుధవారం ముగిసిన 12 రౌండ్ల ఈ టోర్నీలో హంపి మొత్తం 7 పాయింట్లు సాధించింది.

అలెగ్జాండ్రా కొస్టెనిక్‌ (రష్యా)తో జరిగిన చివరి రౌండ్‌లో హంపి 44 ఎత్తుల్లో ఓడిపోయింది. ఒకవేళ ఈ గేమ్‌లో హంపి గెలిచిఉంటే కాంస్య పతకం లభించేది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక 6.5 పాయింట్లతో 16వ స్థానంలో నిలిచింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement