హంపి, హారికల ఓటమి | Koneru Humpy ,harika lost chess tournment | Sakshi
Sakshi News home page

హంపి, హారికల ఓటమి

Sep 29 2013 1:51 AM | Updated on Jun 2 2018 4:03 PM

‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్‌లో అజేయంగా ముందుకు దూసుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారికలకు శనివారం అనూహ్య పరాజయాలు ఎదురయ్యాయి.

తాష్కెంట్: ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్‌లో అజేయంగా ముందుకు దూసుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారికలకు శనివారం అనూహ్య పరాజయాలు ఎదురయ్యాయి.

తొమ్మిదో రౌండ్‌లో హంపి 60 ఎత్తుల్లో బేలా ఖోతెనాష్‌విలి (జార్జియా) చేతిలో; హారిక 48 ఎత్తుల్లో అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా) చేతిలో ఓడిపోయారు. ఈ టోర్నీలో హంపి, హారికలకు ఇదే తొలి ఓటమి కావడం గమనార్హం. తొమ్మిదో రౌండ్ తర్వాత హంపి ఆరున్నర పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండ గా... హారిక ఐదున్నర పాయింట్లతో కాటరీనా లాగ్నో (ఉక్రెయిన్), బేలా ఖోతెనాష్‌విలిలతో కలిసి ఉమ్మడిగా రెండో స్థానంలో ఉంది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement