
కోహ్లి, అశ్విన్‌లకు బీసీసీఐ అవార్డులు
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వార్షిక అవార్డుల వేడుక బుధవారం ఘనంగా జరిగింది.
బెంగళూరు: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వార్షిక అవార్డుల వేడుక బుధవారం ఘనంగా జరిగింది. భారత కెప్టెన్ విరాట్ కోహ్లి పాలీ ఉమ్రిగర్ అవార్డును, స్పిన్నర్ అశ్విన్ ‘దిలీప్ సర్దేశాయ్’ అవార్డును అందుకున్నారు. పాలీ ఉమ్రిగర్ అవార్డును మూడుసార్లు అందుకున్న ఏకైక క్రికెటర్‌గా కోహ్లి గుర్తింపు పొందాడు. భారత మహిళా క్రికెట్ జట్టు సారథి మిథాలీ రాజ్‌కు ‘బెస్ట్ ఉమన్ క్రికెటర్’ అవార్డు దక్కింది. రాజిందర్ గోయెల్, పద్మాకర్ శివాల్కర్‌లకు కల్నల్ సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారం దక్కగా, శాంత రంగస్వామికి మహిళల కేటగిరీలో బీసీసీఐ జీవిత సాఫల్య పురస్కారం లభించింది.
అవార్డు విజేతల జాబితా
►లాలా అమర్‌నాథ్ అవార్డు (రంజీ బెస్ట్‌ఆల్‌రౌండర్): జలజ్ సక్సేనా (మధ్యప్రదేశ్)
►లాలా అమర్‌నాథ్ అవార్డు (దేశవాళీ వన్డేల బెస్ట్ ఆల్‌రౌండర్): అక్షర్ పటేల్ (గుజరాత్)
►మాధవరావు సింధియా అవార్డు (రంజీల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్): శ్రేయస్ అయ్యర్ (ముంబై)
►మాధవరావు సింధియా అవార్డు (రంజీల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్): షాబాజ్ నదీమ్ (జార్ఖండ్)
►ఎం.ఎ.చిదంబరం ట్రోఫీ (అండర్–23 విభాగంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్): జయ్ జి.బిస్తా (ముంబై)
►ఎం.ఎ.చిదంబరం ట్రోఫీ (అండర్–23 విభాగంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్): సత్యజీత్ బచ్చవ్ (మహారాష్ట్ర)
►ఎన్‌కేపీ సాల్వే అవార్డు (అండర్–19 విభాగంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్): అర్మాన్ జాఫర్ (ముంబై)
►ఎన్‌కేపీ సాల్వే అవార్డు (అండర్–19 విభాగంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్): నినద్ రథ్వా (బరోడా)
►రాజ్‌సింగ్ దుంగార్పూర్ అవార్డు (అండర్–16 విభాగంలో అత్యధిక పరుగుల చేసిన బ్యాట్స్‌మన్): అభిషేక్ శర్మ (పంజాబ్)
►రాజ్‌సింగ్ దుంగార్పూర్ అవార్డు (అండర్–16 విభాగంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్): అభిషేక్ శర్మ (పంజాబ్);
►దేశవాళీ క్రికెట్‌లో బెస్ట్ అంపైర్ అవార్డు: నితిన్ మీనన్; దేశవాళీ టోర్నీలో ఉత్తమ ప్రదర్శన అవార్డు: ముంబై