కోహ్లి చాలా కాస్ట్‌లీ.. కష్టం! | Kohli Pakistan Fans PSL Request Trolled | Sakshi
Sakshi News home page

Mar 3 2018 6:41 PM | Updated on Mar 23 2019 8:23 PM

Kohli Pakistan Fans PSL Request Trolled - Sakshi

సాక్షి, స్పోర్ట్స్‌ : భారత ఆటగాళ్లను ఉద్దేశించి ఎవరైనా ట్వీట్లు చేస్తే చాలూ.. ఫ్యాన్స్‌ అందుకు తగ్గట్లుగానే రియాక్ట్‌ అవుతుంటారు. నెగటివ్‌ అయితే తిడుతూ.. పాజిటివ్‌ అయితే సంబరపడుతూ బదుళ్లు ఇస్తుంటారు. అయితే మరి కోహ్లిని ఉద్దేశించి ట్వీట్లు చేస్తే ఊరుకుంటారా? వెంటనే ట్రోల్‌ చేసేస్తున్నారు. 

పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లో టీమిండియా కెప్టెన్‌ కోహ్లి ఆడితే చూడాలనుకుంటున్నాం అంటూ ఓ పాక్‌ అభిమాని ఫ్లకార్డు ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఇస్లామాబాద్‌ యునైటెడ్‌-క్వెట్టా గ్లాడియేటర్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇది చోటు చేసుకుంది. దీనిని పట్టుకుని సోషల్‌ మీడియాలో కూడా కొందరు కోహ్లికి రిక్వెస్ట్‌లు పెడుతున్నారు. 

మరి అది చూసి టీమిండియా ఫ్యాన్స్‌ ఊరుకుంటారా? పీఎస్‌ఎల్‌కు కోహ్లిని కొనేంత సీన్‌ లేదు, కోహ్లి ధర వెలకట్టలేనిది, కోహ్లిని కోనడం కలలో కూడా మీకు జరగని పని, పాక్‌కు కశ్మీర్‌ ఎలాగో కోహ్లి కూడా అంతే.. రెండూ దక్కవు. మొత్తం ఇలాంటి సందేశాలే కనిపిస్తున్నాయి.

పాక్‌ ప్లేయర్‌ను ఆడుకున్న సొంత ఫ్యాన్స్‌

Advertisement
 
Advertisement
Advertisement