పాక్‌ క్రికెటర్‌ను ఆడేసుకుంటున్నారు

Pakistan Cricketer Wahab Trolled for whiskers - Sakshi

సాక్షి, ఇస్లామాబాద్‌ : సోషల్‌ మీడియాలో చేసే పోస్టుల విషయంలో ముఖ్యంగా సెలబ్రిటీలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఒక్కోసారి అవి వికటించే ప్రమాదం ఉంటుంది. తాజాగా పాక్‌ క్రికెటర్‌ ఒకరు  ‘కొత్త లుక్కు’  పేరిట చేసిన ప్రయోగం అతన్ని ట్రోల్‌ చేసి పడేస్తోంది. 

పాకిస్థాన్‌​ బౌలర్‌ వాహబ్‌ రియాజ్‌ ప్రస్తుతం పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లో పెషావర్‌ జల్మీ టీం తరపున ఆడుతున్నాడు. దుబాయ్‌లో ఈ టోర్నీ జరుగుతోంది. గురువారం తొలి మ్యాచ్‌ సందర్భంగా వాహబ్‌ తన మీసాలను కట్‌ చేయించుకుని కొత్త లుక్కుతో దర్శనమిచ్చాడు. గతంలో ఆస్ట్రేలియన్‌ బౌలర్‌ మిచెల్‌ జాన్సన్‌ ఇదే తరహా లుక్కుతో కనిపించటంతో.. ఇక క్షణం గ్యాప్‌ కూడా తీసుకోకుండా వాహబ్‌ ఫోటోలపై ఫన్నీ కామెంట్లు చేసేస్తున్నారు. ఇందులో పాకిస్థాన్‌ ఫ్యాన్సే ఎక్కువగా ఉండటం గమనార్హం.

మ్యాచ్‌కు ముందు కెప్టెన్‌ మహ్మద్‌ హఫీజ్‌.. వాహబ్‌తో ఓ సెల్ఫీ దిగి.. ‘తొలి మ్యాచ్‌కు సిద్ధమైపోయాం. వాహబ్‌ కొత్త లుక్కు సరిగ్గా లేదనే అనుకుంటున్నా!’ అంటూ ట్వీట్‌ చేశాడు. ‘అతని కొత్త లుక్కు మీకేలా నచ్చింది’ అంటూ పీఎస్‌ఎల్‌ అఫీషియల్‌ ట్విట్టర్‌ ఓ సందేశం ఉంచింది.. ‘మీసాలు పెంచినంత మాత్రానా నువ్వు(వాహబ్‌) మిచ్చెల్‌ జాన్సన్‌వి​ కాలేవు’ అని కొందరు.. ‘పేద మిచ్చెల్‌ జాన్సన్‌’ ‘పాపం మిచ్చెల్‌ జాన్సన్‌’ అంటూ మరికొందరు.. జాన్సన్‌-వాహబ్‌ ఫోటోలను పక్కపక్కన పెట్టి ఆన్‌ లైన్‌ ఆర్డర్‌ జోక్‌ తో మరొకరు.. చివరకు సింగం సినిమాలో సూర్య పోస్టర్‌తో ఇంకొకరు... ఇలా హిల్లేరియస్‌ పోస్టులతో వాహబ్‌ను ట్రోల్‌ చేస్తున్నారు. 

ఇక ఈ ట్రోలింగ్‌ పై వాహబ్‌ స్పందించాడు. అనుకోకుండా ఆ స్టైల్‌ మార్చానని.. ఒకవేళ అందరికీ తాను జాన్సన్‌ను అనుకరించినట్లు అనిపిస్తే, అది గౌరవంగానే భావిస్తానని చెబుతున్నాడు. పాక్‌ తరపున 79 వన్డేలు, 26 టెస్టులు ఆడిన వాహబ్‌ తిరిగి జట్టులో స్థానం కోసం కృషి చేస్తున్నాడు.

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top