సచిన్ కంటే గొప్ప బ్యాట్స్మన్ కాగలడు | Kohli has potential to match Tendulkar: England's Cork | Sakshi
Sakshi News home page

సచిన్ కంటే గొప్ప బ్యాట్స్మన్ కాగలడు

May 18 2016 6:02 PM | Updated on Sep 4 2017 12:23 AM

సచిన్ కంటే గొప్ప బ్యాట్స్మన్ కాగలడు

సచిన్ కంటే గొప్ప బ్యాట్స్మన్ కాగలడు

బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్తో తనను పోల్చవద్దని విరాట్ కోహ్లీ చెబుతున్నా.. అభిమానుల నుంచి విశ్లేషకులు, మాజీ క్రికెటర్ల వరకు చాలామంది అతనికి ఆ అర్హత ఉందని అంటున్నారు.

లండన్:  బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్తో తనను పోల్చవద్దని విరాట్ కోహ్లీ చెబుతున్నా.. అభిమానుల నుంచి విశ్లేషకులు, మాజీ క్రికెటర్ల వరకు చాలామంది అతనికి ఆ అర్హత ఉందని అంటున్నారు. ఇంగ్లండ్ మాజీ పేసర్ డొమినిక్ కోర్క్ ఓ అడుగు ముందుకేసి సచిన్ కంటే విరాట్ గొప్ప బ్యాట్స్మన్ కాగలడని చెప్పాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో సచిన్ రికార్డులను సమం చేయగల సామర్థ్యం కోహ్లీలో ఉందని అన్నాడు.

సూపర్ ఫామ్లో ఉన్న విరాట్ ఐపీఎల్ సీజన్లో అద్భుతంగా ఆడుతున్న సంగతి తెలిసిందే. ఓ ఐపీఎల్ సీజన్లో మూడు సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా, అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మన్ కోహ్లీ రికార్డులు నెలకొల్పాడు. కోహ్లీ ఆటచూసి చాలామంది అతణ్ని సచిన్తో పోలుస్తున్నారు. తాజాగా కోర్క్ ఈ జాబితాలో చేరాడు. 'సచిన్ కంటే గొప్ప బ్యాట్స్మన్ అవుతాడని చెప్పడం పెద్ద మాటే. అయితే కోహ్లీ ఆటతీరు చూస్తే అతనిలో ఆ సామర్థ్యం ఉందనిపిస్తోంది. ప్రతి బౌలర్ను అలవోకగా ఎదుర్కొంటూ బ్యాటింగ్ చేస్తున్నాడు' అని కోర్క్ అన్నాడు.

సచిన్ మొత్తం 463 వన్డేల్లో 49 సెంచరీలతో 18,426 పరుగులు, 200 టెస్టుల్లో 51 సెంచరీలతో 15,921 పరుగులు చేయగా, కోహ్లీ ఇప్పటి వరకు 171 వన్డేల్లో 25 సెంచరీలతో  7221 పరుగులు, 41 టెస్టుల్లో 11 సెంచరీలతో 2994 పరుగులు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement