రోహిత్‌ను దాటేసిన కోహ్లి

తిరువనంతపురం: టీమిండియా రన్ మెషీన్, సారథి విరాట్ కోహ్లి మరో రికార్డు సాధించాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20ల్లో 19 పరుగులు సాధించడంతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు(2563) చేసిన ఆటగాడిగా సరికొత్త రికార్డు నెలకొల్పొడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ(2562) అత్యధిక పరుగుల రికార్డును అధిగమించాడు. ఇద్దరి మధ్య కేవలం ఒక్క పరుగు మాత్రమే వ్యత్యాసంగా ఉంది. ఇక తరువాతి మ్యాచ్‌లో సమీకరణాలు మారవచ్చు. ఇక ఈ జాబితాలో తొలి రెండు స్థానాల్లో కోహ్లి, రోహిత్‌లు ఉండగా.. మార్టిన్ గప్టిల్(2463, న్యూజిలాండ్), షోయాబ్ మాలిక్(2263; పాకిస్తాన్) తరువాతి స్థానాల్లో ఉన్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి