అనుష్క చూస్తుంది.. వ్యాట్ బీ కేర్‌ఫుల్! | Kohli Fans Warn England Woman Cricketer Danielle Wyatt | Sakshi
Sakshi News home page

అనుష్క చూస్తుంది.. వ్యాట్ బీ కేర్‌ఫుల్!

Mar 22 2018 6:55 PM | Updated on Aug 25 2018 6:31 PM

Kohli Fans Warn England Woman Cricketer Danielle Wyatt - Sakshi

సాక్షి, ముంబై: ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డానియెల్లీ వ్యాట్ గుర్తుందా?.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని.. నన్ను పెళ్లి చేసుకో అంటూ గతంలో ట్వీట్ చేసిన క్రికెటరే ఇ డానియెల్లీ వ్యాట్. నాలుగేళ్ల  కింద ఆమె విరాట్‌కు ట్వీటర్ ద్వారా ప్రపోజ్ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. ఆపై ఆమెను కలుసుకున్న సందర్భంలో వ్యాట్‌కు కోహ్లి బ్యాట్ బహుమతిగా ఇచ్చాడు. తాజాగా కోహ్లి అభిమానులు మహిళా క్రికెటర్‌ వ్యాట్‌కు స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

విషయం ఏంటంటే ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, ఇండియాల మధ్య జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా వ్యాట్‌ ముంబైకి వచ్చారు. ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి మ్యాచ్‌ తర్వాత వ్యాట్‌కి కాస్త విరామం దొరికింది. దీంతో ముంబైలోని ఎలిఫెంటా ఐలాండ్‌ వెళ్తున్నామని వ్యాట్‌ ట్వీట్‌ చేశారు. అంతే సంగతి! నిమిషాల్లో కోహ్లి అభిమానులు ట్వీటర్‌లో వ్యాట్‌కు స్వీట్ వార్నింగ్ ఇస్తూ కామెంట్లు చేస్తున్నారు. గతేడాది డిసెంబర్‌లో అనుష్కశర్మ, విరాట్ కోహ్లిల వివాహం జరిగిన విషయం తెలిసిందే. ‘కోహ్లి ఇంటికి కొద్ది దూరంలోనే నువ్వు ఉన్నావ్‌’  అతడి పక్కన అనుష్క ఉంటుంది జాగ్రత్త అంటూ క్రికెట్ ప్రేమికులు కొందరు వ్యాట్ పోస్టుకు రిప్లై ఇచ్చారు. అనుష్క నిన్ను గమనిస్తుంటుంది, జాగ్రత్తగా ఉండాలంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశారు.

2014లో టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లినప్పుడు వ్యాట్, కోహ్లిని కలిసింది. ఈ సందర్భంగా విరాట్ ఆమెకు బ్యాట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఆ బ్యాట్‌ను మార్చి 23న ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌లో వాడనున్నట్లు వ్యాట్‌ తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement