Virat Kohli Instructs to Umesh Yadav - 'Aim His Head' | రస్సెల్‌ తలను టార్గెట్‌ చేయ్‌.! - Sakshi
Sakshi News home page

Apr 9 2018 4:33 PM | Updated on Apr 9 2018 5:04 PM

Kohli Asked Umesh Yadav To Aim for the Russell Head - Sakshi

కోల్‌కతా :  ఈడెన్‌ గార్డేన్స్‌ వేదికగా ఆదివారం కోల్‌కతానైట్‌ రైడర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి చేసిన సైగలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. కోల్‌కతా విజయానికి 30 పరుగుల దూరంలో ఉండగా ఆర్సీబీ పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ 17 ఓవర్‌ వేయడానికి బంతి అందుకున్నాడు. తొలి బంతిని కోల్‌కతా ఆలౌరౌండర్‌ ఆండ్రూ రస్సెల్‌ బౌండరీ తరలించగా.. రెండో బంతిని డాట్ చేశాడు. అయితే పరుగుల కట్టడి చేసే ప్రయత్నంలో ఉమేశ్‌ యాదవ్‌ మూడో బంతిని వైడ్‌ వేశాడు.

దీనికి కోహ్లి రస్సెల్‌ టార్గెట్ చేయ్ అంటూ ఉమేశ్‌కు సైగ చేశాడు. అలానే ఉమేశ్ బంతిని తలకు వేయడంతో రస్సెల్‌ బంతిని బ్యాట్‌ తగిలించే ప్రయత్నంలో ఇబ్బందిపడ్డాడు. కొంచెంలో హిట్‌ వికెట్‌ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. దీనికి కోహ్లి నవ్వుతూ.. సంతోషం వ్యక్తం చేశాడు.  ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఇక ఈ మ్యాచ్‌లో కోల్‌కతా 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement