కోలుకున్న రాహుల్ | kl rahul recovered from injury | Sakshi
Sakshi News home page

కోలుకున్న రాహుల్

Dec 6 2016 1:01 AM | Updated on Sep 4 2017 9:59 PM

కోలుకున్న రాహుల్

కోలుకున్న రాహుల్

చేతి వేలి గాయం నుంచి కోలుకున్న ఓపెనర్ లోకేశ్ రాహుల్ ఈనెల 8న ఇంగ్లండ్‌తో మొదలయ్యే నాలుగో టెస్టుకు అందుబాటులోకి వచ్చాడు.

ముంబై టెస్టులో ఓపెనర్‌గా బరిలోకి
ముంబై: చేతి వేలి గాయం నుంచి కోలుకున్న ఓపెనర్ లోకేశ్ రాహుల్ ఈనెల 8న ఇంగ్లండ్‌తో మొదలయ్యే నాలుగో టెస్టుకు అందుబాటులోకి వచ్చాడు. మరో ఓపెనర్ మురళీ విజయ్‌తో కలిసి అతను ఇన్నింగ్‌‌సను ప్రారంభిస్తాడు. సిరీస్‌లో తొలి రెండు టెస్టులు ఆడిన రాహుల్ వరుసగా 32, 38, 0, 10 పరుగులు చేసి అంతగా ఆకట్టుకోలేకపోయాడు. అయితే వైజాగ్ టెస్టు సందర్భంగా చేతి వేలికి గాయం కావడంతో ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్ మొహాలీ టెస్టుకు దూరమయ్యాడు.

ఈ ఏడాది విశేషంగా రాణించిన రాహుల్ ఇంగ్లండ్‌తో సిరీస్‌లో మాత్రం తనస్థారుుకి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. ముంబై టెస్టులో మంచి ఇన్నింగ్‌‌సతో రాణించి రాహుల్ ఫామ్‌లోకి రావాలని పట్టుదలతో ఉన్నాడు. రాహుల్ అందుబాటులో లేకపోవడంతో మొహాలీ టెస్టులో వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ ఇన్నింగ్‌‌సను ప్రారంభించాడు. రాహుల్ రాకతో పార్థివ్ ముంబై టెస్టులో మిడిల్ ఆర్డర్‌లో ఆడతాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement