అరంగేట్రంలోనే గోల్డెన్‌ డక్‌.. | KKRs Denly For Duck on IPL Debut | Sakshi
Sakshi News home page

అరంగేట్రంలోనే గోల్డెన్‌ డక్‌..

Apr 12 2019 8:14 PM | Updated on Apr 12 2019 8:16 PM

KKRs Denly For Duck on IPL Debut - Sakshi

కోల్‌కతా: ఐపీఎల్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆదిలోనే వికెట్‌ కోల్పోయింది. తొలి ఓవర్‌ మొదటి బంతికే కేకేఆర్‌ ఓపెనర్‌ జో డెన్లీ బౌల్డ్‌ అయ్యాడు. ఇషాంత్‌ శర్మ వేసిన ఇన్‌ స్వింగర్‌ వికెట్లను గిరాటేసింది. కాగా, ఇది జో డెన్లీకి ఐపీఎల్‌ అరంగేట్రపు మ్యాచ్‌.  తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌లోనే గోల్డెన్‌ డక్‌గా డెన్లీ ఔట్‌ కావడంతో చెత్త రికార్డును మూటగట్టకున్నాడు.

ఈ రోజు మ్యాచ్‌లో కేకేఆర్‌ క్రిస్‌ లిన్‌, సునీల్‌ నరైన్‌లు తప్పించడంతో ఓపెనర్లుగా డెన్లీ, శుభ్‌మన్‌ గిల్‌లు  వచ్చారు. గత మ్యాచ్‌లో క్రిస్‌ లిన్‌ విఫలమయ్యాడని డెన్లీకి చోటి కల్పిస్తే అతను కూడా విఫలం కావడం కేకేఆర్‌ అభిమానుల్ని నిరాశపరిచింది. ఢిల్లీ టాస్‌ గెలిచి ముందుగా ఫీల్డింగ్‌ తీసుకుంది. దాంతో కేకేఆర్‌ బ్యాటింగ్‌కు దిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement