గౌతం గంభీర్‌ ఔట్‌ | KKR bowl first, Delhi drop Gambhir | Sakshi
Sakshi News home page

గౌతం గంభీర్‌ ఔట్‌

Apr 27 2018 7:46 PM | Updated on Apr 27 2018 7:47 PM

KKR bowl first, Delhi drop Gambhir - Sakshi

ఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా శుక్రవారం ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన కోల్‌కతా కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌.. ఢిల్లీని ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో కోల్‌కతా విజయం సాధించింది.

ఇప్పటివరకూ ఢిల్లీ ఆరు మ్యాచ్‌లు ఆడితే అందులో ఐదు ఓటముల్ని చవిచూసింది. అందులో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో పరాజయం ఎదుర్కొంది. ఇక కోల్‌కతా ఆరు మ్యాచ్‌లకు గాను మూడు గెలిచింది. ఫలితంగా పాయింట్ల పట్టికలో నాల్గో స్థానంలో కొనసాగుతోంది. ఢిల్లీ సారథ్య బాధ్యతల్ని నుంచి గౌతం గంభీర్‌ తప్పకోవడంతో అతని స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇదిలా ఉంచితే,  కేకేఆర్‌తో మ్యాచ్‌కు గంభీర్‌ను ఢిల్లీ మేనేజ్‌మెంట్‌ రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితం చేసింది. అతని స్థానంలో విజయ్‌ శంకర్‌ తుది జట్టులోకి వచ్చాడు.

తుది జట్లు


ఢిల్లీ

శ్రేయస్‌ అయ్యర్‌(కెప్టెన్‌), పృథ్వీ షా, కోలిన్‌ మున్రో, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, రిషబ్‌ పంత్‌, విజయ్‌ శంకర్‌, రాహుల్‌ తెహాతియా, ప్లంకెట్‌, అమిత్‌ మిశ్రా, అవీష్‌ ఖాన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌

కోల్‌కతా

దినేశ్‌ కార్తీక్‌(కెప్టెన్‌), క్రిస్‌ లిన్‌, సునీల్‌ నరైన్‌, రాబిన్‌ ఉతప్ప, నితీష్‌ రానా, ఆండ్రీ రస్సెల్‌, శుభ్‌మాన్‌ గిల్‌, మిచెల్‌ జాన్సన్‌, పీయూష్‌ చావ్లా, శివం మావి, కుల్దీప్‌ యాదవ్‌

Advertisement
 
Advertisement
Advertisement