న్యూజిలాండ్‌ క్లీన్‌స్వీప్‌

Kiwis Complete Whitewash Over Bangladesh - Sakshi

రాణించిన రాస్‌ టేలర్‌

సౌతీకి ఆరు వికెట్లు

మూడో వన్డేలోనూ ఓడిన బంగ్లాదేశ్‌

డ్యూనెడిన్‌: బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్‌ 3–0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. బుధవారం జరిగిన మూడో వన్డేలో కివీస్‌ 88 పరుగుల తేడాతో బంగ్లాపై జయభేరి మోగించింది. ముందుగా న్యూజిలాండ్‌ 50 ఓవర్లలో 6 వికెట్లకు 330 పరుగులు చేసింది. రాస్‌ టేలర్‌ (69; 7 ఫోర్లు), నికోల్స్‌ (64; 7 ఫోర్లు), కెప్టెన్‌ లాథమ్‌ (59; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీలు సాధించారు.

47వ అర్ధసెంచరీ సాధించిన రాస్‌ టేలర్‌ వన్డేల్లో అత్యధిక పరుగులు (8,026) చేసిన న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌గా ఘనతకెక్కాడు. ఇప్పటిదాకా ఈ రికార్డు స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ (8,007) పేరిట ఉండేది. తర్వాత భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ 47.2 ఓవర్లలో 242 పరుగుల వద్ద ఆలౌటైంది. షబ్బీర్‌ రహమాన్‌ (102; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) శతక్కొట్టాడు. టిమ్‌ సౌతీ (6/65) ధాటికి బంగ్లా విలవిల్లాడింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top