ఫైనల్లో కిడాంబి శ్రీకాంత్ | Kidambi Srikanth Reaches Third Straight Final in Lucknow | Sakshi
Sakshi News home page

ఫైనల్లో కిడాంబి శ్రీకాంత్

Jan 30 2016 7:30 PM | Updated on Sep 3 2017 4:38 PM

ఫైనల్లో కిడాంబి శ్రీకాంత్

ఫైనల్లో కిడాంబి శ్రీకాంత్

సయ్యద్ మోదీ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో టాప్ సీడ్ కిడాంబి శ్రీకాంత్(భారత్)ఫైనల్ కు చేరాడు.

లక్నో:సయ్యద్ మోదీ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో టాప్ సీడ్ కిడాంబి శ్రీకాంత్(భారత్)ఫైనల్ కు చేరాడు. ఆదివారం జరిగిన సెమీ ఫైనల్లో శ్రీకాంత్ 21-14, 21-7 తేడాతో 11వ సీడ్ బూన్సాక్ పోన్ సానా(థాయ్లాండ్)పై విజయం సాధించి తుది పోరుకు సిద్ధమయ్యాడు. 32 నిమిషాల పాటు జరిగిన పోరులో శ్రీకాంత్ ఆద్యంతం ఆకట్టుకున్నాడు.

 

తొలి సెట్ లో  11-6 తేడాతో ఆధిక్యంలో కొనసాగిన శ్రీకాంత్.. అదే ఊపును కొనసాగించి ప్రత్యర్థికి ఒక్క పాయింట్ కు కూడా చేజార్చుకోకుండా మరో ఐదు పాయింట్లను సాధించి మరింత ముందుకు సాగిపోయాడు. యితే ఆ తరువాత పుంజుకున్న బూన్సాక్ వరుస పాయింట్లను సాధించినా ఆసెట్ ను కాపాడుకోలేకపోయాడు. ఇక రెండో సెట్ లో 12-6 తో ముందంజలోకి వెళ్లిన శ్రీకాంత్.. సెట్ ను కైవసం చేసుకునే క్రమంలో మిగతా 10 పాయింట్లలో ఒక పాయింట్ మాత్రమే బూన్సాక్ కు ఇచ్చి  ఫైనల్ కు చేరాడు. దీంతో  ఇదే టోర్నీలో వరుసగా మూడోసారి ఫైనల్లోకి ప్రవేశించిన ఆటగాడిగా శ్రీకాంత్ గుర్తింపు సాధించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement