తెలుగు తేజానికి కెరీర్ బెస్ట్ ర్యాంకు | kidambi srikanth gets career best rank | Sakshi
Sakshi News home page

తెలుగు తేజానికి కెరీర్ బెస్ట్ ర్యాంకు

Nov 2 2017 9:00 PM | Updated on Nov 2 2017 9:09 PM

kidambi srikanth gets career best rank - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత నెంబర్ వన్ షట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్‌ మరో అరుదైన మైలురాయికి చేరుకున్నాడు. బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌ (బీడబ్ల్యూఎఫ్‌) గురువారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది అద్భుత ఫామ్‌లో ఉన్న స్టార్ షట్లర్ శ్రీకాంత్ ప్రత్యర్థి ఆటగాళ్లకు ముచ్చెమటలు పట్టిస్తూ నాలుగు టైటిళ్లను నెగ్గిన విషయం తెలిసిందే. రెండు ర్యాంకులు మెరుగు పరుచుకున్న తెలుగుతేజం తాజా ర్యాంకింగ్స్‌లో కెరీర్ బెస్ట్ ర్యాంకు '2'లో నిలిచాడు. డెన్మార్క్‌ షట్లర్ విక్టర్‌ అక్సల్‌సెన్‌ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. భారత్ నుంచి ప్రణయ్ (11), సాయి ప్రణీత్ (16) స్థానాల్లో ఉన్నారు.

సింధు ర్యాంకు పదిలం..
తాజా ర్యాకింగ్స్‌లో పీవీ సింధు తన ర్యాంకును కాపాడుకుంది. గురువారం విడుదలైన మహిళల సింగిల్స్‌ తాజా ర్యాంకింగ్స్‌లో సింధు మరోసారి రెండో స్థానంలో నిలిచింది. మాజీ నెంబర్ వన్ ప్లేయర్ సైనా నెహ్వాల్‌ 11వ స్థానాన్ని దక్కించుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement