కేరళ రికార్డు విజయం | Kerala's record victory | Sakshi
Sakshi News home page

కేరళ రికార్డు విజయం

Nov 25 2016 11:56 PM | Updated on Sep 4 2017 9:06 PM

సొంత గడ్డపై కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీ మరోసారి ఆధిపత్యం చాటుకుంది.

కొచ్చి: సొంత గడ్డపై కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీ మరోసారి ఆధిపత్యం చాటుకుంది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో భాగంగా శుక్రవారం ఎఫ్‌సీ పుణే సిటీతో జరిగిన మ్యాచ్‌లో 2-1తో ఘనవిజయం సాధించింది. స్థానిక నెహ్రూ స్టేడియంలో ఈ జట్టుకిది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. ఇది ఐఎస్‌ఎల్ రికార్డు. కేరళ తరఫున నజోన్ (7వ నిమిషంలో), హ్యూజెస్ (57) గోల్స్ చేశారు. రోడ్రిగెజ్ (90) పుణేకు ఏకైక గోల్‌ను అందించాడు.

Advertisement
 
Advertisement
Advertisement