హాకీ ఇండియా లీగ్‌లో భాగంగా కళింగ లాన్సర్స్, యూపీ విజార్డ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రా అయింది.
లక్నో: హాకీ ఇండియా లీగ్‌లో భాగంగా కళింగ లాన్సర్స్, యూపీ విజార్డ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రా అయింది. ధ్యాన్‌చంద్ హాకీ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఈ లీగ్ మ్యాచ్ 2–2 గోల్స్‌తో డ్రాగా ముగిసింది. యూపీ విజార్డ్స్ తరఫున వీఆర్ రఘునాథ్ (15వ ని.), గొంజాలో పేయ్‌లట్ లు గోల్స్ సాధించగా... కళింగ లాన్సర్స్ తరఫున కెప్టెన్ మోరిట్జ్ ప్యూర్‌స్టే (15వ ని., 51వ ని.) రెండు గోల్స్‌ను చేశాడు. శనివారం జరిగే మ్యాచ్‌లో పంజాబ్ వారియర్స్‌తో దబంగ్ ముంబై తలపడుతుంది.