సెమీస్‌లో జోష్నా, దీపిక | Joshna, Deepika enter to semis | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో జోష్నా, దీపిక

Apr 29 2017 12:59 AM | Updated on Sep 5 2017 9:55 AM

సెమీస్‌లో జోష్నా, దీపిక

సెమీస్‌లో జోష్నా, దీపిక

ఆసియా స్క్వాష్‌ వ్యక్తిగత చాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ క్రీడాకారిణులు దీపిక పళ్లికల్, జోష్నా చినప్ప సెమీఫైనల్లోకి ప్రవేశించారు.

చెన్నై: ఆసియా స్క్వాష్‌ వ్యక్తిగత చాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ క్రీడాకారిణులు దీపిక పళ్లికల్, జోష్నా చినప్ప సెమీఫైనల్లోకి ప్రవేశించారు. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్స్‌లో దీపిక 11–3, 11–6, 11–6తో లియు లింగ్‌ (హాంకాంగ్‌)పై, జోష్నా 11–7, 11–3, 9–11, 12–10తో మిసాకి కొబయాషి (జపాన్‌)పై గెలిచారు.

పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో సౌరవ్‌ ఘోషాల్‌ 11–7, 11–7, 11–7తో విక్రమ్‌ మల్హోత్రా (భారత్‌)పై నెగ్గగా... హరీందర్‌ పాల్‌ సంధూ 8–11, 9–11, 8–11తో మాక్స్‌ లీ (హాంకాంగ్‌) చేతిలో ఓడిపోయాడు. 

Advertisement
 
Advertisement
Advertisement