క్వార్టర్స్‌లో జయరామ్ | Jayaram in quarters | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో జయరామ్

Oct 14 2016 1:27 AM | Updated on Sep 4 2017 5:05 PM

క్వార్టర్స్‌లో జయరామ్

క్వార్టర్స్‌లో జయరామ్

డచ్ ఓపెన్‌లో భారత షట్లర్ అజయ్ జయరామ్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరాడు. కెరీర్‌లో రెండుసార్లు ఈ టైటిల్ గెలిచిన టాప్‌సీడ్ జయరామ్..

ప్రిక్వార్టర్స్‌లో కశ్యప్ ఓటమి
డచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ 


అల్మెరా (నెదర్లాండ్‌‌స): డచ్ ఓపెన్‌లో భారత షట్లర్ అజయ్ జయరామ్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరాడు. కెరీర్‌లో రెండుసార్లు ఈ టైటిల్ గెలిచిన టాప్‌సీడ్ జయరామ్... గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో మా రియస్ మైరే (నార్వే)పై 21-6, 21-6 తేడాతో సునాయాసంగా నెగ్గాడు. క్వార్టర్స్‌లో గోర్ కొయెల్హే డి ఒలివిరా (బ్రెజిల్)తో జయరామ్ తలపడతాడు.

ఇక పారుపల్లి కశ్యప్ పోరాటం ప్రిక్వార్టర్స్‌లో ముగిసింది.  తను 18-21, 18-21 తేడాతో రౌల్ మస్ట్ (ఈస్టోనియా) చేతిలో పరాజయం పాలయ్యాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లో సుమిత్ రెడ్డి, మేఘన జంట క్వార్టర్స్‌కు చేరింది. ప్రిక్వార్టర్స్‌లో వీరు మాస్ జెల్లె, వాన్‌డర్‌పై 21-16, 21-18 (నెదర్లాండ్‌‌స) తేడాతో నెగ్గారు. మరోవైపు పురుషుల డబుల్స్‌లో టాప్ సీడ్‌‌స మను అత్రి, సుమీత్ రెడ్డి జోడితో పాటు ప్రణవ్, ఆక్షయ్ దే వాల్కర్ జోడి కూడా తొలి రౌండ్‌లోనే వెనుదిరిగారు.

Advertisement
 
Advertisement
Advertisement