'మ్యాక్స్ వెల్ ను వేసుకోండి' | Jason Gillespie wants Australia to recall Glenn Maxwell for Bengaluru Test | Sakshi
Sakshi News home page

'మ్యాక్స్ వెల్ ను వేసుకోండి'

Feb 28 2017 4:01 PM | Updated on Sep 5 2017 4:51 AM

'మ్యాక్స్ వెల్ ను వేసుకోండి'

'మ్యాక్స్ వెల్ ను వేసుకోండి'

భారత్లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా జట్టులో స్టార్ ఆటగాడు మ్యాక్ప్ వెల్ ఉంటే తమ జట్టు ఇంకా బలంగా ఉంటుందని మాజీ బౌలర్ జాసన్ గిలెస్పీ పేర్కొన్నాడు.

సిడ్నీ: భారత్లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా జట్టులో స్టార్ ఆటగాడు మ్యాక్ప్ వెల్ ఉంటే తమ జట్టు ఇంకా బలంగా ఉంటుందని మాజీ బౌలర్ జాసన్ గిలెస్పీ పేర్కొన్నాడు. ఇంకా మూడు టెస్టు మ్యాచ్ లు ఆడాల్సిన తరుణంలో మ్యాక్స్ వెల్ ను జట్టులో వేసుకోవాలని సెలక్టర్లకు సూచించాడు. భారత్ స్పిన్ ను వారి దేశంలో ధైర్యంగా ఎదుర్కోవాలంటే మ్యాక్స్ వెల్ ఒక్కడే ప్రత్యామ్నాయంగా గిలెస్పీ తెలిపాడు.

'ఒకవేళ ఆస్ట్రేలియా జట్టు ఏమైనా మార్పులతో మిగతా టెస్టు మ్యాచ్ లకు సిద్దమవ్వాలనుకుంటే మాత్రం మ్యాక్స్ వెల్ ను తుది జట్టులో వేసుకోండి. మ్యాక్సీ ని జట్టులో వేసుకుంటే ఆసీస్ ఇంకా బలపడుతుంది. భారత్ లో స్పిన్ ను ధైర్యంగా ఎదుర్కొనే ఆటగాడు మ్యాక్స్ వెల్. స్పిన్ ను అటాక్ చేసే ఆసీస్ ఆటగాళ్లలో మ్యాక్సీ ఒకడు. మిచెల్ మార్ష్ స్థానంలో అతన్ని వేసుకుంటే మంచిది. ఆసీస్ మరింత సమర్ధవంతంగా సిరీస్ లో ముందుకెళుతుంది' అని గిలెస్పీ సూచించాడు.

Advertisement
 
Advertisement
Advertisement