జనవరి 21 నుంచి హెచ్‌ఐఎల్-5 | January 21 -5 hil | Sakshi
Sakshi News home page

జనవరి 21 నుంచి హెచ్‌ఐఎల్-5

Nov 22 2016 11:45 PM | Updated on Sep 4 2017 8:49 PM

జనవరి 21 నుంచి   హెచ్‌ఐఎల్-5

జనవరి 21 నుంచి హెచ్‌ఐఎల్-5

వచ్చే ఏడాది జనవరి 21న హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) ఐదో సీజన్‌కు తెర లేవనుంది.

ముంబై: వచ్చే ఏడాది జనవరి 21న హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) ఐదో సీజన్‌కు తెర లేవనుంది. ముంబైలో దబంగ్ ముంబై, రాంచీ రేస్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగుతుంది. ఫిబ్రవరి 25న సెమీఫైనల్స్, ఫిబ్రవరి 26న ఫైనల్ జరుగుతారుు.

‘హెచ్‌ఐఎల్ నిబంధనల ప్రకారం డిఫెండింగ్ చాంపియన్ జట్టు మైదానంలో సెమీఫైనల్స్, ఫైనల్‌ను నిర్వహిస్తారు. ప్రస్తుత విజేత పంజాబ్ వారియర్స్ కావడంతో సెమీస్, ఫైనల్ చండీగఢ్‌లో జరుగుతారుు’ అని హెచ్‌ఐఎల్ చైర్మన్, అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) అధ్యక్షుడు నరీందర్ బాత్రా తెలిపారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement