
ఎడిన్‌బర్గ్: స్కాట్లాండ్‌తో జరిగిన వన్డేలో ఓటమి చెందడం పట్ల ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తనదైన శైలిలో స్పందించాడు. ఆ ఓటమితో తమ క్రికెట్ ప‍్రపంచమేమీ అంతకాదని ఇంగ్లండ్ జట్టుకు మద్దతుగా నిలిచాడు. అయితే స్కాట్లాండ్‌తో ఓటమి తాము అనేక విషయాలను నేర్చుకోవడానికి కచ్చితంగా దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
‘ఇదొక గేమ్‌లా తరహాలోనే సాగింది. మా అత్యుత్తమ ప్రదర్శనను కనబరచడానికి చాలా కష్టించాల్సి వచ్చింది. కాకపోతే స్కాట్లాండ్ బాగా ఆడింది. అంతేకాదు విజయం సాధించడానికి వారు అన్ని విధాలా అర్హులు. వారు ఉత్తమ ఆట తీరుతో ఆకట్టుకున్నారు. ఈ ఓటమితో మాకు ప్రపంచం అంతం కాదు. మ్యాచ్ ఆద్యంత పరుగుల వరద పారింది. ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు ముందు మాకు మంచి ప్రాక్టీస్ అయితే లభించింది. వన్డేల్లో మేము నంబర్ వన్ స్థానంలో ఉండటంతో మాపై భారీ అంచనాలు నెలకొన‍్నాయి. మేము టాప్ ర్యాంకులో ఉన్నంత అంచనాలు భారీగా ఉండాలని లేదు. ఈ ఓటమి మమ్మల్ని ఏమీ కృంగదీయడం లేదు. మ్యాచ్‌లో గెలుపు-ఓటములు సాధారణం’ అని ఇయాన్ మోర్గాన్ పేర‍్కొన్నాడు. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక వన్డేలో స్కాట్లాండ్ 6 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.