ఇష్వి మథాయ్‌కి ఐదు పతకాలు | Iswi Madhai Gets Five Medals in Swimming | Sakshi
Sakshi News home page

ఇష్వి మథాయ్‌కి ఐదు పతకాలు

May 27 2019 9:57 AM | Updated on May 27 2019 9:57 AM

Iswi Madhai Gets Five Medals in Swimming - Sakshi

వరంగల్‌: తెలంగాణ రాష్ట్ర అంతర్‌ జిల్లా జూనియర్, సబ్‌ జూనియర్‌ స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌లో రంగారెడ్డి జిల్లా స్విమ్మర్‌ ఇష్వి మథాయ్‌ మెరిసింది. హన్మకొండ జిల్లా స్పోర్ట్స్‌ అథారిటీ (డీఎస్‌ఏ) స్విమ్మింగ్‌పూల్‌లో ఆదివారం ముగిసిన ఈ పోటీల్లో ఇష్వి మథాయ్‌ ఐదు పతకాలు సాధించింది. జియోన్‌ స్పోర్ట్స్‌ టీమ్‌ స్విమ్మర్‌ ఇష్వి బాలికల గ్రూప్‌–1 విభాగంలో 50, 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో రెండు స్వర్ణాలు సొంతం చేసుకుంది.

200 బ్యాక్‌స్ట్రోక్‌లో రజతం... 50, 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో రెండు కాంస్య పతకాలను గెల్చుకుంది. ఇష్వికి కోచ్‌గా జాన్‌ సిద్దిఖీ వ్యవహరిస్తున్నారు. ఈ పోటీల్లో రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల నుంచి సుమారు 400 మంది స్విమ్మర్లు పాల్గొన్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement