కపిల్‌ రికార్డుకు వికెట్‌ దూరంలో..

Ishant One Wicket Away From Surpassing Kapil Dev - Sakshi

జమైకా:  వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో చెలరేగిపోయిన భారత క్రికెట్‌ జట్టు పేసర్‌ ఇషాంత్‌ శర్మ ముంగిట అరుదైన రికార్డు ఉంది.  శుక‍్రవారం నుంచి విండీస్‌తో ఆరంభమయ్యే రెండో టెస్టులో ఇషాంత్‌ వికెట్‌ తీస్తే భారత దిగ్గజ బౌలర్‌ కపిల్‌దేవ్‌ రికార్డును సవరిస్తాడు. ఆసియా ఖండం అవతల అత్యధిక టెస్టు వికెట్లు సాధించిన రెండో భారత బౌలర్‌గా నిలిచేందుకు ఇషాంత్‌కు వికెట్‌ అవసరం. ఆసియా బయట ఇప్పటివరకూ ఇషాంత్‌ శర్మ 45 వికెట్లను సాధించాడు. దాంతో కపిల్‌దేవ్‌ సరసన నిలిచాడు. కాగా, రేపటి నుంచి ప్రారంభమయ్యే టెస్టులో ఇషాంత్‌ వికెట్‌ తీస్తే కపిల్‌దేవ్‌ను అధిగమిస్తాడు. 

ఈ జాబితాలో భారత్‌ తరఫున అనిల్‌ కుంబ్లే(50) అగ్రస్థానంలో కొనసాగుతుండగా, కపిల్‌దేవ్‌, ఇషాంత్‌లు సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. గత టెస్టులో ఇషాంత్‌ శర్మ ఎనిమిది వికెట్లతో విజృంభించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు సాధించిన ఇషాంత్‌.. రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీశాడు. ఫలితంగా కపిల్‌దేవ్‌ సరసన నిలిచాడు.  తొలి టెస్టులో భారత్‌ 318 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ఇషాంత్‌, బుమ్రాల పేస్‌ బౌలింగ్‌కు తోడు అజింక్యా రహానే సొగసైన ఇన్నింగ్స్‌ భారత్‌కు భారీ విజయాన్ని అందించాయి. కాగా, రెండో టెస్టును కూడా భారత్‌ గెలిస్తే విరాట్‌ కోహ్లి అరుదైన ఘనతను సాధిస్తాడు. కెప్టెన్‌గా 28వ టెస్టు విజయాన్ని ఖాతాలో వేసుకుని ఇప్పటివరకూ ధోని పేరిట ఉన్న 27 మ్యాచ్‌ల రికార్డును కోహ్లి బ్రేక్‌ చేస్తాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top