హైదరాబాద్‌లో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణపై ఏర్పడిన సందిగ్ధత తొలగిపోయింది.
సమ్మె విరమించిన హెచ్‌సీఏ సిబ్బంది
హైదరాబాద్: హైదరాబాద్‌లో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణపై ఏర్పడిన సందిగ్ధత తొలగిపోయింది. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) సిబ్బంది, గ్రౌండ్స్‌మెన్ సమ్మె నేపథ్యంలో మ్యాచ్‌లను తరలిస్తారనే ఊహాగానాలకు తెరపడింది. గత 14 రోజులుగా చేస్తోన్న సమ్మెను హెచ్‌సీఏ సిబ్బంది శుక్రవారం విరమించారు. కొంతకాలంగా తమకు బాకీగా ఉన్న జీతాలు, ఇతర అలవెన్సులు, బిల్లులను వెంటనే ఇవ్వాలంటూ సిబ్బంది ధర్నాకు దిగారు.
హెచ్‌సీఏ తాత్కాలిక అధ్యక్షులు నరేందర్ గౌడ్, ఉపాధ్యక్షులు సురేందర్ అగర్వాల్, కార్యదర్శి జాన్ మనోజ్‌లు హామీ ఇవ్వడంతో సమ్మెను విరమిస్తున్నట్లు పేర్కొన్నారు. వెంటనే మ్యాచ్‌లకు గ్రౌండ్‌ను సిద్ధం చేసే పనిలో పడ్డారు. సిబ్బంది ధర్నాను విరమించడం పట్ల హెచ్‌సీఏ అధికారులు హర్షం వ్యక్తం చేశారు.