ఐపీఎల్‌కు భద్రత ఇవ్వలేం | IPL 7 to go out of India over security concerns | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌కు భద్రత ఇవ్వలేం

Feb 22 2014 1:01 AM | Updated on Sep 2 2017 3:57 AM

లోక్‌సభ సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఏడో సీజన్‌కు భద్రత కల్పించలేమని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది.

స్పష్టం చేసిన కేంద్రం
 ప్రారంభ మ్యాచ్‌లు దక్షిణాఫ్రికాలో!
 
 న్యూఢిల్లీ: లోక్‌సభ సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఏడో సీజన్‌కు భద్రత కల్పించలేమని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాలతో గురువారం జరిగిన సమావేశంలో హోం మంత్రి షిండే ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ‘ఏప్రిల్-మేలో ఎన్నికల కారణంగా ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం తగినంత భద్రతా సిబ్బందిని కేటాయించలేము. ఎన్నికలు ముగిశాకే అది వీలవుతుంది’ అని హోం మంత్రి షిండే తెలిపారు. మేనెల మధ్యలో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. ప్రత్యామ్నాయ వేదికను చూసుకోవాలని ఇప్పటికే బీసీసీఐకి హోం శాఖ సమాచారం ఇచ్చింది. దీంతో అప్పటిదాకా మ్యాచ్‌లను దక్షిణాఫ్రికాలో నిర్వహించే అవకాశాలున్నాయి. 2009లోనూ ఎన్నికల కారణంతో లీగ్‌ను ఆ దేశంలోనే జరిపారు. అయితే ఈనెల 28న భువనేశ్వర్‌లో జరిగే ఐపీఎల్ పాలక మండలి సమావేశంలో వేదికపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
 
 ‘వేదికపై ఇతర బోర్డులతో చర్చిస్తున్నాం’
 లీగ్ భద్రతపై కేంద్రం చేతులెత్తేయడంతో ప్రత్యామ్నాయ వేదికలపై బీసీసీఐ కసరత్తు ప్రారంభించింది. దీంట్లో భాగంగా ఇతర దేశాల బోర్డులతో సంప్రదింపులు జరుపుతోంది. ‘కేంద్రం వ్యక్తం చేసిన అభిప్రాయంతో ఐపీఎల్ నిర్వహణ కోసం వివిధ దేశాల బోర్డులతో మాట్లాడడం జరుగుతోంది. దక్షిణాఫ్రికా ఫేవరెట్‌గా ఉన్నా ఇతర ప్రత్యామ్నాయం గురించి కూడా ఆలోచిస్తున్నాం’ అని లీగ్ చైర్మన్ రంజిబ్ బిస్వాల్ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement