ఎంత ఎదిగిపోయావ్‌ కరన్‌..

IPL 2019 Chris Gayle shares throwback picture with Sam Curran - Sakshi

న్యూఢిల్లీ: స్యామ్‌ కరన్ ప్రస్తుతం పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) పుణ్యమా అని ఈ ఆల్‌ రౌండర్‌కు క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. గతేడాది చివరల్లో జరిగిన ఐపీఎల్‌ వేలంలో 7.2 కోట్లతో కింగ్స్‌ పంజాబ్‌ కొనుగోలు చేయడంతోనే వార్తల్లోకెక్కాడు. ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌లోనే విఫలం కావడంతో తర్వాతి రెండు మ్యాచ్‌లకు కరన్‌ను పక్కకు పెట్టారు. అయితే ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌కు గేల్‌ గాయం కావడంతో కరన్‌ మళ్లీ జట్టులోకి చేరాడు. ఆ మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ వికెట్‌ సాధించి ఓవర్‌ నైట్ స్టార్‌ అయ్యాడు. ఈ సీజన్‌లో కరన్‌ సాధించిన హ్యాట్రికే మొదటిది కావడం విశేషం. అయితే తాజాగా కరన్‌కు సంబంధించిన ఫోటోను క్రిస్‌ గేల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
కరన్‌తో చిన్నప్పుడు, ఇప్పుడు దిగిన ఫోటోను గేల్‌ షేర్‌ చేశాడు. ‘తొలి ఫోటోలో నేను యంగ్‌గా ఉన్నా.. ప్రస్తుత ఫోటోలో కరన్‌ చాలా యంగ్‌గా ఉన్నాడు’అంటూ గేల్ పేర్కొన్నాడు. ‘ఎంత ఎదిగిపోయావ్‌ కరన్‌’అంటూ నెటిజన్లు కామెంట్‌ పెడుతున్నారు.  ప్రస్తుతం గేల్‌, కరన్‌లు ఐపీఎల్‌లో కింగ్స్‌ పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఢిల్లీతో మ్యాచ్‌లో గేల్‌ గైర్హాజరీ నేపథ్యంలోనే కరన్‌ జట్టులోకి రావడం విశేషం. ఇక కింగ్స్‌ పంజాబ్‌ తన తరువాతి మ్యాచ్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌తో శనివారం తలపడనుంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top