టోక్యో ఒలింపిక్స్లో 5 కొత్త గేమ్స్ | IOC approves five new sports for Tokyo 2020 olympics | Sakshi
Sakshi News home page

టోక్యో ఒలింపిక్స్లో 5 కొత్త గేమ్స్

Aug 4 2016 1:08 PM | Updated on Apr 4 2019 5:25 PM

టోక్యో ఒలింపిక్స్లో 5 కొత్త గేమ్స్ - Sakshi

టోక్యో ఒలింపిక్స్లో 5 కొత్త గేమ్స్

టోక్యోలో జరగనున్న 2020 ఒలింపిక్స్ లో మరో 5 కొత్త గేమ్స్ ను ప్రవేశపెట్టనున్నారు.

రియోడీజనీరో: టోక్యోలో జరగనున్న 2020 ఒలింపిక్స్ లో మరో 5 కొత్త గేమ్స్ ను ప్రవేశపెట్టనున్నారు. బాస్కెట్ బాల్, సాఫ్ట్ బాల్, కరాటే, స్కేట్ బోర్డు, క్లైంబింగ్ అండ్ సర్ఫింగ్ గేమ్స్ కు అనుమతిస్తూ అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం(ఐఓసీ) నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్షుడు థామస్ బాచ్ తెలిపారు. రియోడీజనీరోలో నిర్వహించిన ఐఓసీ 129వ సమావేశం అనంతరం ఈ వివరాలను కమిటీ వెల్లడించింది. 5 గేమ్స్ లో భాగంగా ప్రవేశపెట్టనున్న 18 ఈవెంట్లలో 474 మంది ఆటగాళ్లు టోక్యో గేమ్స్ లో ప్రాతినిధ్యం వహించే అవకావం ఉంది.

మరిన్ని క్రీడాంశాలకు చెందిన ఆటగాళ్లకు అవకాశం కల్పించేందుకు కృషిచేస్తున్నట్లు ఐఓసీ ఓ ప్రకటనలో తెలిపింది. యువతను ఇందులో భాగం చేసేందుకు సర్ఫింగ్ లో పరుషులతో పాటు మహిళలకు కూడా అవకాశం కల్పించారు. సర్ఫింగ్, స్కేట్ బోర్డింగ్ విభాగాలలో 20 మంది పాల్గొంటారని, జపాన్ మార్షల్ ఆర్ట్ కేంద్ర కార్యాలయంలో కరాటే పోటీలు నిర్వహిస్తామని బాచ్ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement