కివీస్కు ఆదిలోనే ఎదురుదెబ్బ | Injured Southee out of India Tests | Sakshi
Sakshi News home page

కివీస్కు ఆదిలోనే ఎదురుదెబ్బ

Sep 17 2016 12:01 PM | Updated on Sep 4 2017 1:53 PM

కివీస్కు ఆదిలోనే ఎదురుదెబ్బ

కివీస్కు ఆదిలోనే ఎదురుదెబ్బ

భారత గడ్డపై సుదీర్ఘ క్రికెట్ సిరీస్ ఆడటానికి అడుగుపెట్టిన న్యూజిలాండ్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.

కాన్పూర్: భారత గడ్డపై సుదీర్ఘ క్రికెట్ సిరీస్ ఆడటానికి అడుగుపెట్టిన న్యూజిలాండ్కు  ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఈనెల 22వ తేదీ నుంచి ఆరంభం కానున్న మూడు టెస్టుల సిరీస్కు కివీస్ ప్రధాన పేసర్ టిమ్ సౌతీ దూరమయ్యాడు. ప్రాక్టీస్ సెషన్లో సౌతీ ఎడమ కాలికి గాయం కావడంతో అతను టెస్టు సిరీస్ నుంచి అర్థాంతరంగా వైదొలగాల్సి వచ్చింది.


అక్టోబర్ 16వ తేదీ నుంచి ఆరంభమయ్యే వన్డే సిరీస్ నాటికి ఈ స్టార్ బౌలర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని న్యూజిలాండ్ కోచ్ మైక్ హెస్సెన్ తెలిపారు.  అతని గాయం నయం కావడానికి కనీసం 10 రోజులు సమయం పడుతుందన్నారు. సౌతీ స్థానంలో మాట్ హెన్రీ జట్టుతో కలుస్తాడన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement